హోమ్ /వార్తలు /uncategorized /

ఆవుకు ఘనంగా సీమంతం... భారీగా గిఫ్ట్‌లు కూడా వచ్చాయి..!

ఆవుకు ఘనంగా సీమంతం... భారీగా గిఫ్ట్‌లు కూడా వచ్చాయి..!

ఆవు అంశవేణిని అందంగా అలంకరించారు. అంశవేణి సంరక్షణ చూస్తున్నఆరుతరమ్ తిరుపురసుందరి అమ్మై ఆలయ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

  • Local18
  • Last Updated :
  • Tamil Nadu, India

కొందరు తమ పెంపుడు జంతువుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగానే భావిస్తారు. తమతో పాటు.. తాము పెంచుకున్న పెట్స్‌కు కూడా సకల సౌకర్యాలు సమకూరుస్తారు. అలాగే వాటికి బర్త్ డేలు కూడా ఘనంగా చేస్తుంటారు అవి చనిపోతే.. ఆ కుటుంబం ఎంతో దుఖంలో నిండిపోతుంది. పెంచుకున్న జీవి దూరమైతే... అంతే ప్రేమతో వాటికి అంత్యక్రియలు కూడా నిర్వహిస్తుంటారు.

తాజాగా  ఓ ఆవుకి సీమంతం  చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.  ఆవుపై త‌మ‌కి ఉన్న ప్రేమ‌ని..భ‌క్తిని చాటుకున్నారు ఆ కుటుంబ‌స‌భ్యులు. త‌మిళ‌నాడులోని ఆలయంలో ఉన్న గోమాత‌కి ఘ‌నంగా సీమంతం వేడుక‌ని నిర్వ‌హించారు. రాష్ట్రంలోని కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం గ్రామంలో గర్భిణిగా ఉన్న అంశవేణి అనే అవుకు సీమంత వేడుకను ఎంతో ఘనంగా చేశారు. ఆవు అంశవేణిని అందంగా అలంకరించారు. అంశవేణి సంరక్షణ చూస్తున్నఆరుతరమ్ తిరుపురసుందరి అమ్మై ఆలయ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ ఫంక్షన్ కు దాదాపు 500 మంది అతిథులు హాజరు కాగా వారందరికీ 24 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.ఈ వేడుకకు హాజరైన వారు ఆవుకు గిఫ్టులు కూడా అందించారు. మహిళలు ధరించే కంకణాలతో సహా 48 రకాల కానుకలు కూడా ఆవుకు అందాయి.ఈ సీమంతం వేడుకలో భాగంగా ఆలయ అర్చకులు అంశవేణికి స్నానం చేయించారు. అనంతరం పూలు, గంటలతో అంశవేణిని అలంకరించారు. కార్యక్రమం పూర్తయ్యాక వచ్చిన అతిథులంతా అంశవేణి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.ఇప్పుడీ ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

First published:

Tags: Local News, National, Tamilnadu

ఉత్తమ కథలు