హోమ్ /వార్తలు /uncategorized /

Andhra Pradesh: తిరుపతిలో గోడలపై వైసీపీ రంగులా..? క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

Andhra Pradesh: తిరుపతిలో గోడలపై వైసీపీ రంగులా..? క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

తిరుమలలో వైసీపీ రంగులా? నిజం ఏంటి?

తిరుమలలో వైసీపీ రంగులా? నిజం ఏంటి?

Andhra Pradesh: ఈ మధ్య కాలంలో వైసీపీ రంగులపై విపక్షాల ఆరోపణలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పణ్యక్షేత్రల దగ్గర కూడా రంగులు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా తిరుమలలోనూ ఇలాంటి విమర్శలే వినిపించారు. అయితే వాటిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirumala, India

  Andhra Pradesh: ఓ వైపు తిరుమలలో బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) వైభవంగా సాగుతున్నాయి. గోవింద నామ స్మరణతో మాఢ వీధులు మారుమోగుతున్నాయి. భక్తులు అంత్యంత పవిత్రంగా భావించే.. ఆ బ్రహ్మోత్సవాలపైనా రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP) ని టార్గెట్ చేస్తూ.. విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తిరుమల (Tirumala) లో అలిపిరికి వెళ్లే మార్గంలో గోడలపై వైసీపీ రంగులు (YCP Colors), రోడ్లపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై విమర్శలు చెలరేగాయి. గోడలపై ఉన్న దేవుడి బొమ్మలు తొలగించి వైసీపీ రంగులు వేశారని ఆరోపణలు వచ్చాయి. దేవుడిని కూడా వదలరా అంటూ విమర్శలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. విపక్షాల విమర్శలతో.. భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  తిరుమలలో పార్టీ రంగులు ఏంటి.. దేవుడిని రాజకీయం చేయొద్దని కొంతమంది విమర్శలు చేయాల్సి వచ్చింది. అయితే విపక్షాలే కావాలని అసత్య ఆరోపణలు చేస్తున్నాయని.. సీఎం జగన్ కు ఉన్న ఆధరణ జీర్ణించుకోలేక ఇలాంటి విమర్శలు చేయడం దారుణం అంటూ అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ రంగుల వ్యవహారంపై ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చింది.

  ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించింది. తిరుపతి నగరంలోని గోడ చిత్రాలపై జరుగుతున్న ప్రచారం దురుద్దేశపూరితంగా చేస్తున్నారని విమర్శించింది. తిరుపతి నగర వ్యాప్తంగా వెలిసిపోయిన గోడ చిత్రాలను గుర్తించి వాటి స్థానంలో కొత్త కళాకృతులను చిత్రీకరించే పనులు కొనసాగుతున్నాయని ఏపీ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. అందులో భాగంగా పలువురి జాతీయనేతల చిత్రాలను నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో గోడలపై చిత్రీకరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

  తిరుపతిలో రోడ్డు పక్కన ఉండే గోడల సుందరీకరణ కార్యక్రమం దశల వారీగా జరుగుతోందని ఏపీ ఫ్యాక్ట్ చెక్ వివరించింది. అసలు విషయం తెలియకుండా.. అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలు ఎవరైనా.. ఏ పార్టీ వారు అయినా.. ఒకసారి వచ్చి ఇక్కడ చేపడుతున్న కళాకృతులను చూసి, అభినందించాల్సిందిగా కోరుతున్నామని ఆ విరణలో సూచించింది.

  ఇదీ చదవండి : బాలకృష్ణ ట్వీట్ పై దుమారం.. మంత్రుల ఎదురుదాడి.. నందమూరి కుటుంబం ఒక్కటయ్యేనా?

  ప్రభుత్వ విరణపై టీడీపీ మరోలా స్పందించింది. కిలోమీటర్ల మేర ఉండే దేవుడి బొమ్మలను తొలగించి.. ఓ నాలుగు బొమ్మలను మాత్రం ఉంచారని.. మిగతా మొత్తం తొలగించారని ఆరోపిస్తున్నారు. కొందరు వైసీపీ నేతలు దురుద్దేశంతోనే గోడలకు వైసీపీ రంగులు వేశారని మండిపడింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

  కి.మీ. మేర దేవతా మూర్తుల బొమ్మలు చెరిపేసి, 10 మీ. ఉన్న చోటు చూపించి మోసం అంటావ్ ఏంటి ఫేక్ ఫెలో ? కేవలం నాలుగు బొమ్మలు మిగిల్చి, మోసం అంటావా ?

  కానీ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సత్య దూరమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ చెబుతోంది. ఏ గోడలకు పార్టీ రంగులు వేయలేదు.. కేవలం ఆధునీకరించడంలో భాగంగా మహానుభావుల చిత్రాలు మాత్రమే వేస్తున్నామని.. ఎవరికైనా అనుమానం ఉంటే.. అక్కడకు వచ్చి చెక్ చేసుకోవచ్చని సలహా ఇస్తోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Fact Check

  ఉత్తమ కథలు