బుల్లితెర భారీ పాపులారిటీ షో.. అందులో పాల్గొన్న సెలబ్రిటీలను బాగానే ఫేమస్ చేస్తోంది. అప్పటికే టాలెంటెడ్ అని నిరూపించుకున్న వాళ్ళను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చి జనాలకు పరిచయం చేసే షో కావడంతో.. ఈ షో ద్వారా వారంతా ఫేమస్ అయిపోతున్నారు. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక వారి వారి కెరీర్ సాఫీగా సాగిపోతుండటం, టెక్నాలజీ క్యాచ్ చేసుకుంటూ పలు రకాల ఆఫర్స్ ఒడిసిపట్టడం చూస్తున్నాం. అయితే అలా వచ్చిన సొమ్మును ఓ నమ్మకమైన ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తూ దూరదృష్టితో వెళుతున్నారు కొందరు బిగ్ బాస్ పార్టిసిపెంట్స్.
ఈ లిస్టులో బిగ్ భామలైన యాంకర్ శ్యామల (Anchor Shyamala), దివి (Divi), ఇనయ (Inaya) ఉన్నారు. ఈ భామలంతా కూడా సొంతంగా ప్రాపర్టీలు కొనాలని, అది కూడా ఒకే ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సొంతిళ్లు అనేది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు అంతా కూడా నగరంలోని శివారు ప్రాంతం మీద కన్నేసి అక్కడే తమ తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నారు.
ఇప్పటికే సెలెబ్రిటీలకు చాలా మందికే శివారు ప్రాంతంలో ఎన్నో ఫాం హౌస్‌లు, ప్రాపర్టీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ భామలు కూడా ఇదే బాటలో వెళుతున్నట్లు ఓ విషయం బయటకొచ్చింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా వెంచర్స్ లో వీళ్లంతా ప్రాపర్టీస్ తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యాంకర్ శ్యామల రెండో సీజన్‌లో సందడి చేస్తే.. దివి నాలుగో సీజన్‌లో హవా నడిపించింది. ఇక చివరకు ఇనయ బిగ్ బాస్ ఇంట్లో కనిపించింది. ఆరో సీజన్‌లో ఇనయ అదరగొట్టేసింది. అయితే ఇప్పుడూ ఈ ముగ్గురు కూడా ఒకే ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలని పూనుకోవడం ఆసక్తికర అంశం. కాగా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసి బయటకొచ్చిన పలువురు పార్టిసిపెంట్స్ కార్లు, ఇల్లు కొనుక్కున్న సంగతి తెలిసిందే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని ఫ్యూచర్ బ్రైట్ గా ఉంచుకోవాలనే కోణంలో ఇలా భూమిపై పెట్టుబడి పెడుతూ వస్తున్నారు బిగ్ బాస్ కంటిస్టెంట్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actor Divi, Bigg Boss, Telugu Actress