Ram Charan Shelved movie: ముహూర్తం పెట్టిన ఆ సినిమాను రామ్ చరణ్ ఎందుకు ఆపేసాడో తెలుసా..?
Ram Charan Shelved movie: ముహూర్తం పెట్టిన ఆ సినిమాను రామ్ చరణ్ ఎందుకు ఆపేసాడో తెలుసా..?
Ram Charan: నటుడు అన్న తర్వాత కొన్ని సినిమాలు ఆగిపోతుంటాయి. ఎంత పెద్ద హీరో అయినా కూడా కొన్ని సినిమాల విషయంలో అనివార్య కారణాలతో ఇబ్బంది పడుతుంటాడు. దానికి ఎవరూ మినహాయింపు కాదు. రామ్ చరణ్ (Ram Charan) విషయంలో కూడా ఇదే జరిగింది.
Ram Charan: నటుడు అన్న తర్వాత కొన్ని సినిమాలు ఆగిపోతుంటాయి. ఎంత పెద్ద హీరో అయినా కూడా కొన్ని సినిమాల విషయంలో అనివార్య కారణాలతో ఇబ్బంది పడుతుంటాడు. దానికి ఎవరూ మినహాయింపు కాదు. రామ్ చరణ్ (Ram Charan) విషయంలో కూడా ఇదే జరిగింది.
నటుడు అన్న తర్వాత కొన్ని సినిమాలు ఆగిపోతుంటాయి. ఎంత పెద్ద హీరో అయినా కూడా కొన్ని సినిమాల విషయంలో అనివార్య కారణాలతో ఇబ్బంది పడుతుంటాడు. దానికి ఎవరూ మినహాయింపు కాదు. రామ్ చరణ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈయన కెరీర్లో కొన్ని సినిమాలు మొదలు పెట్టి ఆపేసారు. అందులో కొరటాల శివ సినిమా కూడా ఉంది. అప్పుడు మిస్ అయినా కూడా ఇప్పుడు ఆచార్యలో చేసాడు రామ్ చరణ్.
దాంతో పాటు కెరీర్ మొదట్లోనే మరో సినిమాను కూడా మొదలు పెట్టి ఆపేసాడు చరణ్. అదే తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో ముహూర్తం జరుపుకున్న మెరుపు సినిమా. అప్పటికే తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా బంగారం సినిమా తెరకెక్కించాడు ధరణి. అది ఫ్లాప్ అయింది. అయినా కూడా ఆయన చెప్పిన కథ నచ్చి ఓకే అన్నారు.
మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆరెంజ్ లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీ చేసాడు రామ్ చరణ్. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఆరెంజ్ డిజాస్టర్ అయింది. నాగబాబును నిర్మాతగా పూర్తిగా ముంచేసింది ఆరెంజ్. దీని అప్పుల నుంచి కోలుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేసాడు నాగబాబు.
అంతటి దారుణమైన ఫలితం అందించింది ఈ చిత్రం. అయితే ఆరెంజ్ తర్వాత ఈయన మెరుపు అనే సినిమా మొదలు పెట్టి ఆపేసాడు. ఈ సినిమాలో హీరోయిన్గా లక్కీ బ్యూటీ కాజల్ అగర్వాల్‌ని తీసుకున్నారు. ఇది ఫుట్ బాల్ నేపథ్యంలో సాగే కథ. అందుకే ఈ చిత్రంలో కోచ్ పాత్రలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ను తీసుకున్నారు.
అట్టహాసంగా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆర్థిక సమస్యలు రావడంతో ఆపేసారు. నిర్మాత బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పి సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేసారు. మెరపు సినిమా ఆగిపోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు మాత్రమే అని.. అప్పట్లో చరణ్‌పై ఈ బడ్జెట్ వర్కవుట్ కాదని ఆపేసారని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ఎప్పుడూ మెరుపు సినిమా గురించి ఆలోచించలేదు దర్శక నిర్మాతలు. అలా ఫుట్ బాల్ ప్లేయర్‌గా రామ్ చరణ్‌ను చూసే అవకాశం మిస్ అయిపోయింది. అయితే ఇప్పటికీ తనకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలంటే యిష్టం అంటున్నాడు చరణ్. అలాంటి కథ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపాడు. త్వరలోనే గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోయే సినిమాలో స్పోర్ట్స్ పర్సన్‌గానే కనిపించబోతున్నాడు చరణ్. జెర్సీ తర్వాత మరోసారి అలాంటి కథనే చేయనున్నాడు గౌతమ్.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా కోసం వేచి చూస్తున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రంతో పాటు శంకర్ సినిమాకు కూడా కమిటయ్యాడు రామ్ చరణ్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మరోవైపు సంక్రాంతికి రావాల్సిన ట్రిపుల్ ఆర్ వాయిదా పడటంతో నిరుత్సాహంలో ఉన్నాడు చరణ్. ఈ చిత్రం సమ్మర్ 2022కి వచ్చేలా కనిపిస్తుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.