పారితోషకం విషయంలో నయనతారను బీట్ చేస్తోన్న సమంత..

తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబి’తో మరో సక్సెస్ అందుకుంది. ఈ సినిమాల తర్వాత సమంత తన పారితోషకాన్ని అమాంతం పెంచేసినట్టు సమాచారం. అంతేకాదు సౌత్‌లో నయనతార తర్వాత అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది.

news18-telugu
Updated: July 27, 2019, 7:12 PM IST
పారితోషకం విషయంలో నయనతారను బీట్ చేస్తోన్న సమంత..
సమంత నయనతార
  • Share this:
అవును తెలుగులో ప్రస్తుతం సమంత దూకుడు మాములుగా లేదు. ఒకప్పుడు హీరోల సరసన ఆడిపాడటానికే పరిమితం అయ్యే సమంత.. పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై దృష్టి సారించింది. గతేడాది ‘యూటర్న్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సమంత.. అ ఇయర్ మాత్రం తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబి’తో మరో సక్సెస్ అందుకుంది. ఈ సినిమాల తర్వాత సమంత తన పారితోషకాన్ని అమాంతం పెంచేసినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు రూ. 2కోట్లు తీసుకున్న సమంత.. తాజాగా తన పారితోషకాన్ని కోటి పెంచి రూ. 3 మూడు కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.

పారితోషకం విషయంలో నయనతారను బీట్ చేస్తోన్న సమంత..
సమంత నయనతార


ఇక రెమ్యూనరేషన్ విషయంలో సౌత్‌లో ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటూ నయనతార టాప్‌లో ఉంది. ఆమె కూడా ఒక వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే..మరోవైపు మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ ఈ రేంజ్‌కు చేరుకుంది.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>