29 రాష్ట్రాలు... 7 కేంద్ర పాలిత ప్రాంతాలు... ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ... అతి పెద్ద పండుగ జరుపుకుంటోంది భారత దేశం. ఇవాళ్టి నుంచీ మే 19 వరకూ ఏడు దశల్లో పోలింగ్ జరగబోతోంది. మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. రెండోసారి అధికారం చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఈసారి మై బీ చౌకీదార్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. ఎన్టీయే ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని చేపట్టే లక్ష్యంతో కాంగ్రెస్ ఈసారి కనీస ఆదాయ పథకంతో ప్రజల్లోకి వెళ్లింది. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే సాగుతోంది. ఐతే ఈసారి ఎన్నికలకు సంబంధించి ఎన్నో ఆసక్తికర అంశాలున్నాయి. అవేంటో ఫటాఫట్ తెలుసుకుందాం.
17వ లోక్ సభ ఎన్నికల ప్రత్యేకతలు :
* దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉండగా... వారిలో 90 కోట్ల మంది ఓటు వెయ్యబోతున్నారు. ప్రపంచంలోనే అత్యధికం.
* 43 కోట్ల 20 లక్షల మంది మహిళలకు ఓటు హక్కు ఉంది. వీళ్లలో ఎంత మంది ఓటు వేస్తారన్నది కీలకం. 2014లో మూడింట రెండొంతుల మంది మహిళలు ఓటు వేశారు.
* ఈసారి కొత్త ఓటర్ల సంఖ్య 8 కోట్ల 30 లక్షల మంది.
* 18, 19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య కోటి 50 లక్షల మంది
* దేశవ్యాప్తంగా 38,000 మంది ట్రాన్స్ జెండర్స్ ఓటు వేయబోతున్నా్రు.
* ఏప్రిల్ 11 నుంచీ మే 19 వరకూ 7 దశలు పూర్తయ్యేందుకు 38 రోజులు పట్టనుంది.
* దేశవ్యాప్తంగా 10లక్షల 35 వేల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
* ఏ ఓటరైనా వారికి 2 కిలోమీటర్లలోపే పోలింగ్ బూత్ ఉండేలా చేస్తున్నారు.
* ఈ ఎన్నికల్లో వాడుతున్న ఈవీఎంల సంఖ్య 39లక్షల 60వేలు.
* ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ మెషిన్స్ (VVPATS) మొత్తం 17లక్షలు.
* దేశవ్యాప్తంగా కోటీ 10 లక్షల మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వహించబోతున్నారు.
* ప్రపంచంలోనే అతి ఎత్తైన పోలింగ్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్‌లోని తాషిగాంగ్‌లో ఏర్పాటవుతోంది. అది 15,256 అడుగుల ఎత్తులో ఉండబోతోంది.
* దేశంలో రిజిస్టరైన రాజకీయ పార్టీల సంఖ్య 2,293
* ఇప్పటివరకూ 543 స్థానాలకు పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 8,000
* ఇప్పటివరకూ ఈసీ పట్టుకున్న డబ్బు, మద్యం, డ్రగ్స్ విలువ రూ.1,460,00,00,000
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.