ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు.. టీఎస్ఆర్టీసీ (TSRTC) యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar).. ఇప్పుడు మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ప్రయాణికులకు వినోదం అందించేందుకు 'టీఎస్ఆర్టీసీ రేడియో' (TSRTC Radio)ను తీసుకొస్తున్నారు. దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తులు చేసి.. పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ (Hyderabad)9 ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో టీఎస్ఆర్టీసీ రేడియోను అందుబాటులోకి తీసుకొచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో కూకట్‌పల్లి డిపోకు చెందిన బస్సులో 'టీఎస్ఆర్టీసీ రేడియో'ను సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం రేడియో పనితీరును ఆయన పరిశీలించారు. రేడియో ఏర్పాటు, అది పనిచేసే విధానం, సౌండ్ వంటి విషయాల గురించి టీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ మునిశేఖర్, కూకట్‌పల్లి డిపో మేనేజర్ ఇషాక్ బిన్ మహ్మద్, మెకానికల్ సూపరింటెండెంట్ జయరాం, ఎలక్ట్రిషియన్ కేవీఎస్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
Warangal | Waltair veerayya: చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట..!
టీఎస్‌ఆర్టీసీ రేడియో ప్రయాణీకులను అలరిస్తుందని వీసీ సజ్జనార్ తెలిపారు. ఉప్పల్-సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్-సికింద్రాబాద్, గచ్చిబౌలి-మెహిదీపట్నం, సికింద్రాబాద్-పటాన్‌చెరువు, కూకట్‌పల్లి-శంకర్‌పల్లి, కొండాపూర్-సికింద్రాబాద్, కోఠి-పటాన్‌చెరువు, ఇబ్రహీంపట్నం-జేబీఎస్ మార్గాల్లో నడిచే బస్సుల్లో ఈ టీఎస్ఆర్టీసీ రేడియోను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ప్రయాణికులకు వినోదం అందించడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ రేడియోల్లో మంచి మంచి సినిమా పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను, టీఎస్‌ఆర్టీసీ అందిస్తున్న సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నామని చెప్పారు సజ్జనార్. మానవ సంబంధాల ప్రాముఖ్యత, నైతిక విలువలను పెంపొందించే నీతి కథలను కూడా ప్రసారం చేస్తామని వెల్లడించారు. అంతేకాదు.. మహిళల, పిల్లల భద్రత, సైబర్, ఆర్థిక నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా మొదట 9 బస్సుల్లోనే రేడియోలను ప్రారంభించామని.. ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత.. పూర్తిస్థాయిలో అన్ని బస్సుల్లోనూ రేడియోను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తుందని వీసీ సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను స్వీకరించేందుకు.. ఆయా బస్సుల్లో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. రేడియోపై ఫీడ్‌బ్యాక్‌ను ప్రయాణికులు ఇవ్వాలని సూచించారు. టీఎస్‌ఆర్టీసీ తీసుకువచ్చిన వినూత్న కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించారని.. ఈ రేడియోను కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు వీసీ సజ్జనార్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Telangana, Tsrtc