Video : అరుదైన నత్త... ఆశ్చర్యపోతున్న ప్రజలు

Zombie Snail : ఈ ప్రపంచంలో రెండు కళ్లు, ఓ ముక్కు, ఓ నోరు ఉండేవి మాత్రమే కాదు... రకరకాల జీవులున్నాయి. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తూ... ఇలాంటి జీవులు కూడా ఉన్నాయా అని అనుకునేలా చేస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 16, 2019, 7:03 AM IST
Video : అరుదైన నత్త... ఆశ్చర్యపోతున్న ప్రజలు
వింత నత్త (Image : Twitter - Mike Inouye)
Krishna Kumar N | news18-telugu
Updated: August 16, 2019, 7:03 AM IST
Zombie Snail : సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎందుకంటే అందులో జాంబీ స్నైల్ ఉంది. చాలా మంది ఆ నత్తను మొదటిసారి చూసినవాళ్లు భయపడుతూ... కాసేపు అలాగే చూశాక... అరే ఇది భలే ఉందే.. అంటున్నారు. ఇది రంగులు ఎలా మార్చుకోగలుగుతోంది? అది కళ్లార్పకుండా దాన్ని చూస్తున్నారు. ఇలాంటి నత్తలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు వాళ్లు. దీన్నీ జాంబీ స్నైల్ అని పిలుస్తున్నారు. మైక్ ఇనోయే అనే యూజర్ దీన్ని వీడియో తీసి... ట్వి్ట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ నత్త బాడీ, కళ్లలో రంగులు చకచకా మారుతున్నాయి. అవి ఎంతో కాంతివంతంగా మెరుస్తున్నాయి. ఇందుకు కారణం కూడా మైక్ వివరించాడు. నిజానికి ఇదో ప్రత్యేకమైన పురుగు లాంటి నత్త (A parasitic worm Leucochloridium). ఇది రంగులు మార్చుకుంటూ పక్షుల్ని ఎట్రాక్ట్ చేస్తుంది. పక్షులు దీన్ని తినేస్తాయి. కానీ... పొట్టలోకి వెళ్లాక అక్కడ అది గూడు కట్టుకొని... గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత... పక్షి వ్యర్థాల నుంచీ బయటకు వచ్చేస్తుంది. ఇలా ఇది తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటుందట.


ఉత్తర అమెరికా, యూరప్‌లోని నిలువెత్తు అడవుల్లో ఇవి కనిపిస్తుంటాయి. పరాన్నజీవి లాంటి ఇవి... కాకులు, చిలుకలు ఇతర పక్షులపై ఆధారపడి కూడా బతకగలవు. చూడ్డానికి అందంగా ఉన్న ఈ నత్త అసలు విషయం తెలిస్తే... భయమేస్తోందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ నత్తను చంపేయాలని మరో నెటిజన్ ఆవేశంగా స్పందించాడు. కొంతమంది ఇదేం నత్తరా బాబూ అంటూ కామెంట్లు చేశారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...