Home /News /trending /

ZOMBIE DISEASE FOUND IN DEERS IN CANADA DOES IT TRANSMIT TO HUMANS HERE IS INTERESTING DETAILS SK

Zombie Virus: వామ్మో.. జాంబీ వైరస్... చంపుకు తింటున్న జింకలు.. అచ్చం జాంబి రెడ్డి మూవీలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Zombie virus in Deers: కెనడాలోని పలు జింకల జాతుల్లో జాంబి వైరస్ సంక్రమణ వేగంగా వ్యాపిస్తోంది. దీని బారిన పడిన జింకలు ఇతర జింకలను చంపి తింటున్నాయి.

  కరోనా వ్యాధి యావత్ ప్రపంచాన్ని నాశనం చేసింది. 2019 నుంచి మానవాళిని పట్టి పీడిస్తోంది. ఈ వైరస్‌కు త్వరగానే వ్యాక్సిన్ తయారుచేసినప్పటికీ.. ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ విరుచుకుపడుతోంది. మనదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇతర దేశాల్లో ఇంకా పంజా విసురుతూనే ఉంది కరోనా వైరస్. తన పుట్టినిల్లు చైనాలో ప్రస్తుతం అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇది మునుపటిలా ప్రాణాంతకం కానప్పటికీ.. ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో ఊహించలేం. అందుకే అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఐతే ఈ వ్యాధి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే.. కెనడా మరో డెంజరస్ వైరస్ వచ్చేసింది. అది అలాంటి.. ఇలాటిది కాదు.. జాంబి వైరస్. జింకల్లో జాంబి వైరస్ (Zombie Virus in Deers) బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురిచిస్తున్నాయి.

  VICE వరల్డ్ న్యూస్ వార్తల ప్రకారం.. కెనడాలోని పలు జింకల జాతుల్లో జాంబి వైరస్ సంక్రమణ వేగంగా వ్యాపిస్తోంది. దీని బారిన పడిన జింకలు ఇతర జింకలను చంపి తింటున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దీనిని అంటు వ్యాధిగా ప్రకటించారు. జింకలలో అత్యంత వేగంగా ఈ మహమ్మారి వ్యాపిస్తోందని అల్బెర్టా విశ్వవిద్యాలయానికి చెందిన వన్యప్రాణి వ్యాధి నిపుణుడు మార్గో పిబస్ తెలిపారు. జాంబి రెడ్డి, వరల్డ్ వార్ జెడ్ సినిమాల్లో చూపించినట్లుగా.. ఈ వ్యాధి సోకిన వారు ఇతరులను కరుస్తారు. అప్పుడు వారు కూడా జాంబిలా మారుతారు. ప్రస్తుతం కెనడాల్లోని జింకలు ఇలానే చేస్తున్నాయి. ఒకదానిని మరొకటి కరిచి.. చంపుకొని తింటున్నాయి.

  Viral Video:పెళ్లి పీటల మీద కాబోయే భర్తతో కన్నీళ్లు పెట్టించిన యువతి.. కారణం తెలిస్తే షాక్

  జింకల్లో జాంబీ వైరస్ (Deer Zombie) కనుగొనడం ఇదే తొలిసారి కాదు. మొదటిసారి 1996లో ఇది కనిపించింది. అప్పుడు ఓ పొలంలో ఉన్న పశువుల్లో బయటపడింది. ఆతర్వాత క్రమంగా ఇతర పశువులకు వ్యాపించింది. జాంబీ వైరస్ బారిన పడిన జంతువులన్నింటినీ చంపేసి..అప్పట్లో ఆ వ్యాధి వ్యాప్తి అడ్డుకట్టు వేశారు. అనంతరం వాటి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. బాక్టీరియా, ఇతర వైరస్‌ల జన్యు సమాచారం లభించింది. కానీ జింకల్లో ఇది వ్యాప్తి చెందుతుందని ఎలాంటి సమాచారం లేదు. జింకల్లో జాంబీ లక్షణాలు కనిపించలేదు. కానీ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత జింకల్లో జాంబీ వైరస్ బయటపడడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.

  OMG: అదృష్టం అంటే ఇతనిదే.. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతుంటే.. ఏకంగా కోట్లు వచ్చిపడ్డాయి..

  మానవులకు వ్యాపించే ప్రమాదం ఉందా?
  ఇది జింక నుంచి ఇతర జంతువులు లేదా మానవులకు వ్యాపిస్తుందని సీడబ్యూడీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ ఎవరైనా జాంబీ వైరస్ బారినపడితే.. నీళ్ల విరోచనాలు, మానసిక ఒత్తిడ, పక్షవాతానికి కూడా గురవుతాడు. ఈ ఇన్ఫెక్షన్ సోకిన జంతువు మాంసం తిన్నా.. దాని మలమూత్రాలు, లాలాజలం పట్టుకున్నా కూడా.. ఇతరులకు సంక్రమిస్తుంది. ఐతే ఇప్పటివరకైతే మనుషులెవరికీ ఈ వ్యాధి సోకలేదు. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ జాగ్రత్తగా ఉండాలని అక్కడి స్థానికులకు చెబుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Canada, Trending, Virus

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు