Zomato: నాలుగేళ్ల చిన్నారి మనస్సు గెలిచిన జొమాటో...శభాష్ అంటున్న నెటిజన్లు...

తన కుమారుడు అమాయకంగా చేసిన ఆ మెసేజ్ ని బాలుడి తండ్రి మెసేజ్‌ల స్ర్కీన్‌షాట్‌ తీసాడు. అంతే కాదు ఆ స్క్రీన్ షాట్ ను జొమాటోకు ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

news18-telugu
Updated: August 9, 2019, 2:42 PM IST
Zomato: నాలుగేళ్ల చిన్నారి మనస్సు గెలిచిన జొమాటో...శభాష్ అంటున్న నెటిజన్లు...
జొమాటో డెలివరీ చేసిన కారుబొమ్మతో చిన్నారి ఆనందం(Image : Twitter)
  • Share this:
నాలుగేళ్ల పసివాడు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే...ముంబయికి చెందిన ఓ బాలుడు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు మెసేజ్ చేశాడు. యాప్ ద్వారా తనకు నచ్చిన బెలూన్లు, కార్లు, ఇంకా ఇతర గిఫ్ట్స్ కావాలని మెసేజ్ లో పెట్టాడు. అయితే తన కుమారుడు అమాయకంగా చేసిన ఆ మెసేజ్ ని బాలుడి తండ్రి మెసేజ్‌ల స్ర్కీన్‌షాట్‌ తీసాడు. అంతే కాదు ఆ స్క్రీన్ షాట్ ను జొమాటోకు ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తన నాలుగేళ్ల కుమారుడు అమాయకంగా జొమాటోలో తనకు నచ్చిన వస్తువులు తెమ్మని మెసేజ్‌ చేశాడని ఆ ట్వీట్‌లో తెలిపాడు. అయితే జొమాటో సైతం బాలుడి మెసేజ్ చూసి ముచ్చటపడింది. అతే కాదు ఆ చిన్నారి కోరిక మేరకు జొమాటో కావల్సిన బొమ్మలు పంపి ఆనందానికి గురిచేసింది. అయితే జొమాటో తన కుమారుడికి బొమ్మలు పంపించి ఆశ్చర్యానికి గురిచేసిందని ఆబాలుడి తండ్రి మరో ట్వీట్ చేశాడు. అయితే బాలుడు చేసిన మెసేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలోనే జొమాటో మధ్యప్రదేశ్ లో ఫుడ్ డెలివరీ బాయ్ వ్యక్తి మతంతో విబేధించి చేయాలని కోరగా, అందుకు జొమాటో ఆహారమే ఒక మతమని పేర్కొని నెటిజన్ల మనస్సు గెలుచుకుంది.





First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...