హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Zomato: హిందీ వస్తేనే డబ్బులు రీఫండ్ చేస్తామన్న జొమాటో.. ట్విట్టర్​లో విరుచుకుపడుతున్న తమిళ నెటిజన్లు

Zomato: హిందీ వస్తేనే డబ్బులు రీఫండ్ చేస్తామన్న జొమాటో.. ట్విట్టర్​లో విరుచుకుపడుతున్న తమిళ నెటిజన్లు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫామ్​ జొమాటో ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. పేలవమైన డెలివరీ సేవలపై ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న జొమాటో తాజాగా భాషా పరమైన వివాదంలో చిక్కుకుంది.

ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫామ్​ జొమాటో ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. పేలవమైన డెలివరీ సేవలపై ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న జొమాటో తాజాగా భాషా పరమైన వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన వికాస్​ అనే వ్యక్తి జొమాటోలో కొన్ని ఆహార పదార్థాలను ఆర్డర్​ చేశాడు. కాసేపటికే డెలివరీ బాయ్​ పార్సిల్​​ తీసుకొచ్చాడు. అయితే పార్సిల్​ తెరిచి చూడగా ఒక ఐటమ్​ మిస్సైనట్లు గ్రహించాడు. వెంటనే జొమాటో కస్టమర్​ కేర్​కు మెసేజ్​ చేశాడు. తన డబ్బులు రీఫండ్​ చేయాలని కోరాడు. అయితే తమిళ భాషలో కంప్లెంట్​ చేయగా.. కస్టమర్​ కేర్​ సిబ్బంది సరిగ్గా స్పందించలేదు. పైగా మా కస్టమర్​ కేర్​ సిబ్బందికి తమిళం రాదు కాబట్టి హిందీ భాషలో అయితేనే కంప్లెయింట్​ తీసుకుంటామని చెప్పారు.

అయితే తమిళనాడులో జొమాటో ఉన్నప్పుడు తమిళ భాషను తెలిసిన ఉద్యోగులను నియమించుకోవాలని, లేదంటే భాష తెలిసిన వాళ్లకు చెప్పి రీఫండ్​ చేయించాలని వికాస్​ కోరాడు. అతని రిక్వెస్ట్​కు జొమాటో నుంచి భిన్నమైన సమాధానం వచ్చింది. ‘‘హిందీ జాతీయ భాష. అందరూ ఎంతో కొంత హిందీ తెలుసుకోవాలి. జాతీయ భాషపై ప్రతి ఒక్కరికి కనీస అవగాహన ఉండాలి. మీరు హిందీలో ఫిర్యాదు చేస్తేనే ఫీజు రీఫండ్​ అవుతుంది” అంటూ సమాధానమిచ్చింది.

ఇది కూడా చదవండి: Zomato Controversy: కామెడీ అయిపోయిన జొమాటో వివాదం... వైరల్ వీడియో

దీంతో వికాస్​కు చిర్రెత్తి తమిళ భాషపై వివక్షతను ఎత్తి చూపుతూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ‘#Rejectzomato’ అంటూ ట్వీట్ చేశాడు. జొమాటో వద్ద ఎవరూ ఆర్డర్​ చేయవద్దని, యాప్​ను వెంటనే తొలగించాలని ప్రజలను కోరాడు. ఈ ట్వీట్ కాస్త ట్విట్టర్లో వైరల్​ అవుతోంది. రిజెక్ట్​ జొమాటో అంటూ గంటల్లోనే 20 వేల ట్వీట్లు వెల్లువెత్తాయి. అంతేకాదు, జొమాటో తీరు పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తమిళ సంస్కృతి, భాష పట్ల జొమాటో సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు.

ట్విట్టర్​లో రిజెక్ట్ జొమాటో వైరల్​..

కస్టమర్ల ఆగ్రహంతో పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన జొమాటో వికాస్​ డబ్బులు రీఫండ్​ చేయడమే కాకుండా క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసింది. “వికాస్​ మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. దీనికి కారణమైన కస్టమర్​ కేర్​ ఎగ్జిక్యూటివ్​ని విధుల నుంచి తొలగించాం. వికాస్​తో పాటు తమిళ ప్రజలను క్షమాపణలు కోరుతున్నాం” అని ట్వీట్​ చేసింది.

First published:

Tags: Netizen, Tamil, Trending news, Zomato

ఉత్తమ కథలు