పెంపుడు కుక్కలతో జాగ్రత్త. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ప్రమాదం ఊహించని స్థాయిలో జరుగుతుంది. ముంబై(Mumbai)లో డెలివరీ బాయ్(Delivery boy)కి ఎదురైన చేదుఅనుభవం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ (Viral)అవుతోంది. ఓ అపార్ట్‌మెంట్ (Apartment)కి కొరియర్ డెలవరీ చేయడానికి వచ్చి లిఫ్ట్(Lift)లో పెంపుడుకు కుక్క కరవడంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతకీ ఆ కుక్క డెలవరీ బాయ్‌ని ఎక్కడ కొరికిందో తెలిస్తే షాక్ అవుతారు. డెలివరీ బాయ్‌పై శునకం(Dog) లిఫ్ట్‌లో దాడి చేసింది. లిఫ్ట్‌లో పెట్టిన సీసీ ఫుటేజ్(CCTV footage)లో ఈ వీడియో రికార్డైంది.
పెంపుడు కుక్కలతో ప్రమాదం..
ఇళ్లలో భద్రత కోసం కొందరు కుక్కలను పెంచుకుంటారు. మరికొందరు కాలక్షేపం కోసం జాతి కుక్కలను సాదుతుంటారు. మరికొందరు కుక్కలను పెంచడం హాబీగా పెట్టుకుంటారు. ఏది ఏమైనా కుక్కలను పెంచుకునేటప్పుడు పొరుగు వారికి ఇబ్బంది కలగకుండా , పిల్లలపై అవి దాడి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న కామన్‌సెన్స్ చాలా మందికి ఉండదు. ముంబైలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. పన్వెల్ ప్రాంతంలోని ఇండియాబుల్స్ కాంప్లెక్స్‌కు వచ్చిన జొమాటో బాయ్‌ని ఆ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వ్యక్తి పెంపుడు కుక్క కరిచింది. డెలివరీ బాయ్ లిఫ్ట్‌లోకి ప్రవేశిస్తుండగానే కుక్క కరవబోయింది. అయితే డెలవరీ బాయ్ చాకచక్యంగా హెల్మెట్ అడ్డుపెట్టుకొని లోపలికి వెళ్లాడు.
డెలివరీ బాయ్‌పై దాడి..
లిఫ్ట్‌లోపలికి వెళ్లగానే జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క డెలవరీ బాయ్ ప్రైవేట్ పార్ట్‌ని కొరికింది. ఇదంతా కుక్క యజమాని పక్కన ఉన్నసమయంలో జరిగింది. ఓవైపు శునకం దాడి చేస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యక్తి చోద్యం చూడటంతో డెలవరీ బాయ్ నరేంద్ర కుక్క చేసిన గాయంతో తీవ్రరక్త స్రావం కావడంతో గట్టిగా అరిచాడు. వెంటనే సహాయం కోసం అరుస్తూ పార్కింగ్ స్థలానికి పరిగెత్తాడు.
కుట్లు వేసిన డాక్టర్లు ..
కుక్క దాడిలో గాయపడిన యువకుడు నరేంద్ర పెరియార్ జొమాటోలో డెలవరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కుక్క కాటుతో రక్త స్రావం, నొప్పిని తట్టుకోలేకపోవడంతో స్థానికులు డివై పాటిల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం నరేంద్ర పెరియార్ అక్కడే చికిత్స పొందుతున్నాడు. బాధితుడికి యాంటీ రేబిస్ ఇంజక్షన్ ఇచ్చారు వైద్యులు. కుక్క దాడితో గాయపడిన ప్రైవేట్ ప్రాంతంలో కుట్లు వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mumbai, Trending news, VIRAL NEWS, Viral Video