Home /News /trending /

ZOMATO CONTROVERSY MANY FUNNY VERSIONS COMING ON SOCIAL MEDIA OVER ZOMATO DELIVERY BOY CONTROVERSY PARINEETI CHOPRA SUPPORTS DELIVERY BOY NK

Zomato Controversy: కామెడీ అయిపోయిన జొమాటో వివాదం... వైరల్ వీడియో

కామెడీ అయిపోయిన జొమాటో వివాదం...(image credit - instagram)

కామెడీ అయిపోయిన జొమాటో వివాదం...(image credit - instagram)

Zomato delivery boy Controversy: జొమాటో డెలివరీ బాయ్ వివాదం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్స్‌లో ఒకటి అయ్యింది. ఐతే... ఈ వివాదాన్ని నెటిజన్లు కామెడీగా మార్చేయడం మరో టర్న్ అయ్యింది.

    Zomato Controversy: ఏది నిజం ఏది అబద్ధం... అంటూ జొమాడో వివాదంపై సోషల్ మీడియాలో ఓ కొత్త వీడియో హల్‌చల్ చేస్తోంది. దాన్ని చూసే ముందు... అసలీ వివాదం ఏంటో సింపుల్‌గా తెలుసుకుందాం. కొన్ని రోజుల కిందట బెంగళూరుకు చెందిన ఓ మోడల్... తనను జొమాటో కంపెనీ ఫుడ్ డెలివరీ బాయ్ కామరాజ్... ముక్కు మీద గుద్దాడనీ... ముక్కు పచ్చడైందని ఆరోపించింది. ఆమె పేరు హితేషా చంద్రాణీ. కంటెంట్ క్రియేటర్, మోడల్, మేకప్ ఆర్టిస్ట్ కూడా. గత మంగళవారం ఈ ఘటన జరిగితే... బుధవారం ఆమె ఓ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో... దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై స్పందించిన జొమాటో... దర్యాప్తు జరిపిస్తున్నామనీ... తద్వారా చర్యలుంటాయని చెప్పారు. అంతేకాదు... ఆమెకు అయ్యే మెడికల్ ఖర్చులను కూడా భరిస్తామనీ చెప్పారు. అలాగే... డెలివరీ బాయ్‌కి అయ్యే చట్టపరమైన లీగల్ ఖర్చులను కూడా భరిస్తామని చెప్పారు. ఇలా రెండువైపులా న్యాయంగానే మాట్లాడారు.


    ఆ డెలివరీ బాయ్... మొత్తం 5వేల మంది డెలివరీ బాయ్స్‌లో ఒకరంట. అతని ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. అందువల్ల నిజానిజాలు తేలకుండా చర్యలు తీసుకోలేమని జొమాటో కంపెనీ యాజమాన్యం తెలిపింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఓ వర్గం నెటిజన్లు దీనిపై జోక్స్, మీమ్స్ తయారుచేస్తున్నారు. తాజాగా ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఎవరు రైటు, ఎవరు రాంగ్... అంటూ అందులో రకరకాల వెర్షన్లను కల్పించి మరీ వీడియోచేశారు. అందులో నటించిన వారు నిజమైన వారు కాదు. సరదాగా చేసిన వీడియో అది. ఆ వీడియో మీరూ చూడండి.








    View this post on Instagram






    A post shared by Chudarshan (@chudarshan)






    తాజాగా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా దీనిపై స్పందించింది. కామరాజ్‌కి మద్దతు పలికింది. నిజానిజాల్ని జొమాటో బయటపెట్టాలని ట్వీట్ ద్వారా కోరింది.



    జొమాటో వివాదంలో ఏది నిజం?





    అంతకుముందు పరిణీతి చోప్రా డెలివరీ బాయ్‌కి సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసింది. నిజం తేల్చండి అని అందులో కోరింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని ఫైర్ అయ్యింది. తనపై వచ్చిన ఆధారాలను ఖండించిన డెలివరీ బాయ్... ఆమె తనను తిట్టిందనీ... చెప్పుతో కొట్టిందని ఆరోపించాడు.

    ఇది కూడా చదవండి:Viral Video: జూ కీపర్‌పై దాడి చేసిన భారీ పాము.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు


    మొత్తానికి ఈ వివాదం అంతకంతకూ పెరుగుతోంది. ఇది ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. ఐతే... రోజురోజుకూ డెలివరీ బాయ్‌కి మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Viral Videos, Zomato

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు