సాధారణంగా ఒక పాఠశాల (School)లో 300 నుంచి 500కు పైగా విద్యార్థులు ఉంటారు. ప్రాథమిక పాఠశాల అయితే కనీసం 50 మందికి పైగా ఉంటారు. అలాంటిది స్కూల్ మొత్తానికి ఒకే ఒక్క స్టూడెంట్ ఉన్నాడంటే ఎవరికైనా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి సర్కారు బడి ఒకటి నిజంగానే ఉంది. ఈ పాఠశాల మహారాష్ట్రలోని గణేష్‌పూర్ అనే గ్రామంలో ఉంది. ఈ గ్రామం జనాభా 150 మంది మాత్రమే. ఇక్కడ నడుస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న కార్తిక్ షెగ్‌కర్ అనే విద్యార్థి ఒక్కడే ఉన్నాడు. ఈ స్టూడెంట్‌కు పాఠాలు చెప్పేందుకు ఒకే ఒక్క టీచర్ ఉన్నారు.
ఈ ఒక్క టీచరే కార్తిక్‌కు అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు. ఈ స్కూల్లో ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు బోధిస్తారు. రెండేళ్ల క్రితం కార్తిక్ షెగ్‌కర్ ఇందులో చేరాడు. గ్రామ జనాభా తక్కువ కావడంతో ఇక్కడ పిల్లల సంఖ్య కూడా తక్కువే. మిగిలిన వారు దూరప్రాంతంలోని గవర్నమెంటు, ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్నారు. ఒక్కడే స్టూడెంట్ ఉన్నాడు కాబట్టి, బడిని మూసేయకుండా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్కూల్‌ను కొనసాగిస్తున్నారు.
Maharashtra | A Zilla Parishad primary school in Ganeshpur village of Washim district runs only for one student Population of the village is 150. There is only one student enrolled in the school for the last 2 years. I'm the only teacher in school: Kishore Mankar, school teacher pic.twitter.com/h6nOyZXlDf
— ANI (@ANI) January 23, 2023
* ఎందులోనూ తక్కువ కాదు..
ఒక్కడే స్టూడెంట్ కదా.. అని తేలికగా తీసుకోకుండా మిగిలిన పాఠశాలల మాదిరిగానే ఇక్కడ కూడా అన్నీ పక్కగా జరుగుతాయని ఈ స్కూల్ టీచర్ కిషోర్ మన్కర్ అంటున్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఆయన ఏఎన్ఐ (AN) న్యూస్ ఏజెన్సీతో పంచుకున్నారు. రోజూ 12 కిలోమీటర్లు ప్రయాణించి ఆయన ఇక్కడకు వస్తున్నారు.
ఉదయం జాతీయ గీతం ఆలపించడంతో స్కూల్ ప్రారంభిస్తామని కిషోర్ మన్కర్ చెబుతున్నారు. చదువు ఒక్కటే కాకుండా ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు కార్తిక్ షెగ్కర్కు ఇస్తున్నట్లు ఆయన వివరించారు. అందులో భాగంగానే క్రమం తప్పకుండా మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నామన్నారు. గత రెండేళ్లల్లో కార్తిక్ ఒక్కడే ఇక్కడే చేరాడని, అతడికి అన్ని సబ్జెక్టులు తానే బోధిస్తానని చెప్పారు.
ఇది కూడా చదవండి : ఒకే జంట.. మూడు ఖండాల్లో.. నాలుగుసార్లు పెళ్లి
* ఆదర్శంగా నిలుస్తున్న అధికారులు
గ్రామాల్లో అక్షరాస్యులు పెరిగితేనే భారత్‌లో పేదరిక నిర్మూలన సాధ్యమని విద్యావేత్తలు, నిపుణులు చెబుతున్నారు. ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం అనేక ఇబ్బందులు తప్పట్లేదు. ఎక్కడో అతి తక్కువమంది మాత్రమే ఆ సమస్యలను అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. అందుకు చక్కని ఉదాహరణగా ఈ పాఠశాలను చెప్పుకోవచ్చు. అన్నీ ఉన్నా ఏవో వంకలు చెప్పే టీచర్లను, ప్రభుత్వ అధికారులను మనం చాలామందినే చూస్తుంటాం. అలాంటిది ఒక్క విద్యార్థి కోసం స్కూల్ నడుపుతున్న ఇక్కడ విద్యాశాఖ అధికారులను చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేం అంటున్నారు గ్రామ ప్రజలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharastra, National News, School, VIRAL NEWS