Zero Rupee note: జీరో రూపీ నోట్ అంటే ఏంటి? ఎలా వాడాలి?

జీరో రూపీ నోట్

Zero Rupee note: జీరో రూపాయి నోట్ అనేది ఒకటుందన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇదో సైలెంట్ రివల్యూషన్‌లా ఇండియాలో విస్తరిస్తోంది. ఇది ఏంటో తెలుసుకుందాం.

  • Share this:
    Zero Rupee note: ప్రభుత్వ అధికారులు లంచం అడగడం,... ప్రజలు లంచం ఇవ్వడం ఇండియాలో కామన్‌గా జరుగుతోంది. చట్టప్రకారమైతే... లంచం అడగడం, ఇవ్వడం రెండూ నేరమే. అమెరికాలో జాబ్ చేసిన సాఫ్ట్‌వేర్ ఎన్నారై ఆనంద్... ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న అవినీతిని చూసి ఆశ్చర్యపోయారు. దీనికి ఎలా బ్రేక్ వెయ్యాలి అని ఆలోచించిన ఆయన... ఫిఫ్త్ పిల్లర్ (Fifth Pillar) అనే స్వచ్ఛంద సంస్థను 2007లో స్థాపించారు. ఈ సంస్థ (https://5thpillar.org)... జీరో రూపీ నోట్లను తయారుచేస్తోంది. ఈ నోట్లు రెగ్యులర్ కరెన్సీలాగా చెల్లవు. వీటిపై అమౌంట్ బదులు జీరో ఉంటుంది. చూడటానికి రూ.50 నోటు లాగా ఉంటుంది. ఈ నోట్లపై నేను లంచం ఇవ్వను, తీసుకోను అనే ప్రమాణం రాసి ఉంటుంది.

    ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే... ఈ నోట్లను ఇవ్వండి అని కోరుతున్నారు ఆనంద్. వీటిని ఇచ్చే ముందు... అవినీతి నిరోధక వ్యవస్థ (ACB) అధికారులకు సమాచారం ఇస్తే... నోట్లను ఇచ్చాక... లంచావతారం సంగతి అధికారులు చూసుకుంటారని ఆనంద్ చెబుతున్నారు.

    జీరో రూపీ నోట్


    2007 నుంచి 2014వరకూ ఫిఫ్త్ పిల్లర్ సంస్థ 25 లక్షల నోట్లను ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చింది. ఈ నోట్లను మొదటిసారి చెన్నైలో ఉపయోగించారు. అక్కడ సక్సె్స్ అవ్వడంతో... ఆ తర్వాత తమిళంతోపాటూ... తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నోట్లను ప్రింట్ చేస్తున్నారు.

    జీరో రూపీ నోట్


    ఇండియాతోపాటూ... మెక్సికో, నేపాల్ లాంటి దేశాల్లో కూడా ఈ సంస్థ నోట్లను ముద్రించి ఇస్తోంది. 2020లో ఇండియాలో ఎంత అవినీతి జరుగుతోంది అనే అంశంపై ఈ సంస్థ అధ్యయనం జరిపించగా... సంవత్సరానికి
    రూ.490 కోట్ల అవినీతి జరుగుతోందని తేలింది.

    ఈ నోట్లే ఎందుకు ఇవ్వాలి?
    అధికారులు లంచం అడిగినప్పుడు... ఏసీబీ అధికారులకు చెప్పినా, చెప్పకపోయినా... లంచం ఇవ్వడం నేరం. కాబట్టి... ఏసీబీ అధికారులు పట్టుకుంటే... ఆ అవినీతి అధికారి... "అతను లంచం ఇచ్చాడు కాబట్టే... నేను తీసుకున్నాను... కాబట్టి... లంచం ఇచ్చినందుకు అతన్ని కూడా అరెస్టు చెయ్యాలి" అని మెలిక పెట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ జీరో నోట్లను ఇస్తే... లంచం ఇచ్చినట్లు అవ్వదు. అదే సమయంలో... అవినీతి అధికారి బండారం బయటపెట్టినట్లూ అవుతుంది అన్నది ఈ జీరో రూపీ నోట్ కాన్సెప్ట్. దీనికి యువత నుంచి మంచి స్పందన వస్తోంది.

    ఇది కూడా చదవండి: Video: నకిలీ బిచ్చగాడు.. రోజు సంపాదన రూ.వెయ్యి

    ఇండియాలో అవినీతి జీరో అవ్వాలి అనే ఉద్దేశంతో... జీరో రూపీ నోట్ అని పేరు పెట్టారు. ఈ జీరో రూపీ నోట్లను ఈ సంస్థ... రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్ ప్లేసుల్లో ఉచితంగా ఇస్తోంది. తద్వారా ప్రజల్లో దీనిపై అవగాహన కల్పిస్తోంది. ఎవరికైనా ఈ నోట్లు కావాలంటే... సంస్థ వెబ్‌సైట్‌ (https://5thpillar.org)లోకి వెళ్లి కోరవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: