Real-Life Mowgli: ఇతడు 'రియల్ లైఫ్ మోగ్లీ'.. ఒకప్పుడు అడవిలో గడిపాడు, ఇప్పుడు స్కూల్‌కు వెళ్తున్నాడు... అడవికి ఎందుకు వెళ్లాడంటే..

జంజిమాన్​ ఎల్లీ (Photo credit : Newsflash)

రువాండా దేశానికి చెందిన జాంజిమాన్ ఎల్లీ (Zanziman Ellie) అనే యువకుడిని 'రియల్-లైఫ్ మోగ్లీ' గా పిలుస్తుంటారు. రూపం కాస్త భిన్నంగా ఉండటంతో చిన్నప్పటి నుంచి అందరూ అతన్ని బాగా ఏడిపించేవారట. ఇలాంటి క్రూరమైన ప్రవర్తన కారణంగా అతడు ఏళ్లపాటు అడవిలోనే గడిపాడు.

  • Share this:
ప్రపంచవ్యాప్తంగా జంగిల్ బుక్ (Jungle book) కథల ఆధారంగా సినిమాలు, సీరియళ్లు వచ్చి సూపర్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ జంగిల్ బుక్‌ కథలలోని కథానాయకుడు మోగ్లీ అంటే ఇష్టపడని చిన్న పిల్లలు ఉండరు. ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ మోగ్లీ గురించి మీకు తెలిసే ఉంటుంది కానీ నిజ జీవితంలో కూడా మోగ్లీ (Real-Life Mowgli) ఉన్నాడనేది మీకు తెలుసా? రువాండా దేశానికి చెందిన జాంజిమాన్ ఎల్లీ (Zanziman Ellie) అనే యువకుడిని 'రియల్-లైఫ్ మోగ్లీ' (Real-Life Mowgli)గా పిలుస్తుంటారు. రూపం కాస్త భిన్నంగా ఉండటంతో చిన్నప్పటి నుంచి అందరూ అతన్ని బాగా ఏడిపించేవారట. ఇలాంటి క్రూరమైన ప్రవర్తన కారణంగా అతడు ఏళ్లపాటు అడవి (Forest)లోనే గడిపాడు. అలా అరణ్యంలో జీవితం గడుపుతూ మోగ్లీగా పేరు తెచ్చుకున్న జాంజిమాన్ ఇప్పుడు చక్కగా ప్రతిరోజూ సూట్ ధరించి స్థానిక పాఠశాలకు వెళ్తూ విద్యనభ్యసిస్తున్నాడు (studying).

భిన్నంగా ఉండటానికి కారణం..

జాంజిమాన్ 1999లో రువాండా (Rwanda) దేశంలో జన్మించాడు. అతని భౌతిక రూపం కారణంగా అతన్ని అక్కడి కమ్యూనిటీ దాదాపు వెలివేసింది. అతని రూపం భిన్నంగా ఉండటానికి కారణం మైక్రోసెఫాలీ (microcephaly) ఓ మెడికల్ కండిషన్. ఈ వైద్య పరిస్థితి వల్ల శిశువు తల సాధారణ పరిణామంలో ఉండకుండా చాలా చిన్నగా ఉంటుంది. జాంజిమాన్ కూడా చాలా చిన్న తలతో జన్మించాడు. అయితే తోటి పిల్లలు, స్థానికులు అతని రూపాన్ని ఎగతాళి చేస్తూ ఏడిపించడంతో ఇంటి నుంచి అడవిలోకి పారిపోయాడు. అతని జీవితం గురించి గత సంవత్సరం ఫిబ్రవరిలో యూట్యూబ్‌లో అఫ్రిమాక్స్ టీవీ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దాంతో అతని కథ ప్రపంచ నలుమూలలకు పాకింది.

పాఠశాలకు వెళుతున్న జంజిమాన్​ (Photo: newsflash)


చిన్న తనంలో చదువుకోవాలనే అనుకున్నా..

నిజానికి జాంజిమాన్ (Zanziman Ellie) తన చిన్న తనంలో చదువుకోవాలనే అనుకున్నాడు. చదువుపై ఏకాగ్రత పెట్టేంత మానసిక సామర్థ్యం అతనికి లేదనే కారణంతో పాఠశాల సిబ్బంది అనుమతించలేదు. ఈ క్రమంలో ఆఫ్రిమాక్స్ డాక్యుమెంటరీ ద్వారా అతడికి చాలామంది విరాళాలు అందించారు. ఇప్పుడా విరాళాల వల్లే జాంజిమాన్ (Zanziman Ellie) ప్రత్యేక పాఠశాలకు వెళ్లగలుగుతున్నాడు. అయితే రెగ్యులర్ స్కూల్ కు కాకుండా వెనుకబడిన విద్యార్థులు వెళ్లే ఓ ప్రత్యేకమైన స్కూల్ 9special school)కు వెళ్తున్నాడని సమాచారం.

(photo credit ; Newsflash)


డాక్యుమెంటరీ ప్రసారం చేసిన అనంతరం అఫ్రిమాక్స్ టీవీ (Afrimax TV).. జాంజిమాన్ కోసం గో ఫండ్ మీ (GoFundMe) పేజీని ఏర్పాటు చేసింది. దీంతో ప్రపంచ నలుమూలల నుంచి చాలామంది వీక్షకులు విరాళాలు అందించారు. తాము చేసిన సహాయంతో జాంజిమాన్, అతని తల్లి మెరుగైన జీవితం గడిపితే చాలని ఆక్షేపించారు. అయితే ఇప్పుడు జాంజిమాన్ చదువుకుంటూ మెరుగైన జీవితమే గడుపుతున్నాడని తెలుసుకొని ఆనందపడుతున్నారు. రువాండా (Ruwanda)లోని గిసేనీలోని ఉబుమ్‌వే కమ్యూనిటీ సెంటర్‌లోని ఓ స్పెషల్ స్కinternatioల్ లో జాంజిమాన్ చదువుకోడానికి అందించిన విరాళాలు ఉపయోగపడుతున్నాయని ఒక స్థానిక వార్తా సంస్థ పేర్కొంది.
Published by:Prabhakar Vaddi
First published: