• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • YOUTUBER MR BEAST CRAZY CHALLENGE TO SIT IN A TUB OF SNAKES FOR 7 LAKH RUPPES VIDEO GOES VIRAL SRD

Viral Video : పాములతో 30 సెకన్లు ఉండగలరా.. అయితే 7 లక్షలు మీ సొంతం..

Viral Video : పాములతో 30 సెకన్లు ఉండగలరా.. అయితే 7 లక్షలు మీ సొంతం..

Photo Credit : You Tube

Viral Video : మొన్నటి వరకు బకెట్‌ ఛాలెంజ్‌, పిల్లో ఛాలెంజ్‌, ఫ్లిప్‌ ఛాలెంజ్‌ ఇలా రకరకాల పేర్లతో ఛాలెంజ్‌లు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఇలాంటి ఛాలెంజ్ లు తెగ వైరల్ అవుతున్నాయ్.

  • Share this:
    సోషల్ మీడియా పుణ్యమా అని వింత, చెత్త చాలెంజ్ లు పుట్టుకొస్తున్నాయి. గతంలో కొన్ని చాలెంజ్ లు ప్రాణాల మీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు బకెట్‌ ఛాలెంజ్‌, పిల్లో ఛాలెంజ్‌, ఫ్లిప్‌ ఛాలెంజ్‌ ఇలా రకరకాల పేర్లతో ఛాలెంజ్‌లు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఇలాంటి ఛాలెంజ్ లు తెగ వైరల్ అవుతున్నాయ్. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా మరో కొత్త ఛాలెంజ్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అయితే, ఈ ఛాలెంజ్ లో డబ్బులు కూడా మీ సొంతం చేసుకోవచ్చు. కానీ ఇది అంత సులువైన ఛాలెంజ్‌ మాత్రం కాదు.. ఎందుకంటే పెద్ద పెద్ద పాములతో 30 సెకన్ల పాటు గడపాలి. ప్రముఖ యూట్యూబర్‌ మిస్టర్‌ బీస్ట్‌ ఈ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టాడు. పాములతో ఉన్న ఓ బాత్‌ టబ్‌లో 30 సెకండ్లు గడిపితే ఏకంగా రూ.7 లక్షలను బహుమతిగా అందిస్తున్నాడు. ఇక ఇదొక్కటే కాకుండా ఒక గాజు బాక్సులో డబ్బులను పెట్టి అందులో పెద్ద పెద్ద బొద్దింకలను వేశాడు.. వాటిని తాకకుండా ఎంత డబ్బు తీసుకుంటే అంత మీ సొంతమన్నమాట.

    సాలీడులను శరీరంపై పారించడం, ఒంటరిగా ఉన్న గదిలోకి పెద్ద సంఖ్యలో ఎలుకలను వదలడం, పూర్తిగా కుళ్లి పోయి దుర్వాసన వస్తోన్న కాయగూరల తొక్కలున్న టబ్‌లో పడుకోవడం… ఇలా రకరకాల ఛాలెంజ్‌లను తీసుకొస్తూ యూట్యూబ్‌లో హల్చల్‌ చేస్తున్నాడు మిస్టర్‌ బీస్ట్‌. దీంతో ఈ సాహసాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారుతున్నాయి.

    బీస్ట్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోకు ఏకంగా రెండు కోట్లకుపైగా వ్యూస్‌ రావడం విశేషం. ఇక లేటెస్ట్ గా అతని వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇప్పటికే అతని లేటెస్ట్ వీడియోకు 27 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయ్. మరి మీకు కూడా ఇలాంటి సాహసం చేయగలననే నమ్మకం ఉందా..? అయితే ఎందుకు ఆలస్యం మిస్టర్‌ బీస్ట్‌ ఛాలెంజ్‌ స్వీకరించి ప్రైజ్‌ మనీని సొంతం చేసుకోండి. అయితే, బీ కేర్ ఫుల్.. పాములంటే భయపడే వాళ్లు మాత్రం ఈ ఛాలెంజ్ కు దూరంగా ఉండండి.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు