(సంతోష్, పెద్దపల్లి)
పాటల కవ్వంతో కష్టాలను చిలికిన కోయిలమ్మ! .. పల్లె పదాలతో (Village words) జీవితాన్ని పూదోట చేసుకున్న అవ్వ ఇప్పుడు.. యూట్యూబ్ సింగర్ (You tube singer)! ఆమె జానపదాలు తెలుగురాష్ట్రాల ప్రజలనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలను ఊర్రూతలూగిస్తున్నాయి. ఆమె మన తెలంగాణ (Telangana) బిడ్డ కనకవ్వ (Kanakavva)… రెక్కల కష్టాన్ని నమ్ముకుంటూ జీవనం సాగించే కనకవ్వ తన కష్టాన్ని మర్చిపోవడానికి పాటను (Song) ఆసరా చేసుకుంది. పొద్దున లేచింది మొదలు పాటతోనే రోజు మొదలయ్యే కనకవ్వ జానపదాలు ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటున్నాయి. జానపదాలు, బతుకమ్మ పాటలు పాడే 63 ఏళ్ల కనకవ్వ సొంతూరు పెద్దపల్లి (Peddapalli) జిల్లా గోదావరిఖని లోని ఇందిరానగర్. వాడవాడల్లో తిరుగుతూ పండ్లు అమ్ముకుంటూ, పొలాల్లో కూలిపనులకు వెళ్లే అవ్వ ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్‌లకు పాడుతూ, అందుకు తగ్గట్టు పాదం కదుపుతూ యూ ట్యూబ్‌లో సింగర్ కనకవ్వగా మారింది.
నర్సాపల్లె గంగిలోన రంగరాజు..
కనకవ్వ (Kanakavva) పాడిన ప్రతి పాట ప్రజలను ఉత్సాహ పరిచింది. ముఖ్యంగా కనకవ్వ పాడిన పాటలలో (Songs) నర్సాపల్లె గంగిలోన రంగరాజు (Narsapalli Gangilona Rangaraju) ,గెన్నెరామ గెన్నెరామ గెన్నెరామ గెట్టుమీద గున్నమామిడో పిల్లడో..గూట్లేమో కుసున్నాయి గురియవన్నె పావురాలు.. సక్కని కనుల వారజూడవో ఓ బాలయ్య.. ఇలా ఎన్నో జానపద పాటలు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారం (Medaram)లో… గుండెల్లో కొ (YouTube)లువున్న గూడెం జాతర ఎన్నో పల్లె పదాలు..ప్రజలకు మరింత చేరువయ్యాయి. సంసార నావను దాటించడానికి రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కనకవ్వ జీవితమంతా ఈ పాటలే పూదోటగా మారి నడిపించాయి.
కనకవ్వ జీవితం కష్టాల కడలిలో ..
పదేళ్ళ వయసులోనే పెళ్లి….పెళ్లి అయ్యాక అన్ని కష్టాలే…బతకడానికి ఊరూరా తిరిగేవాళ్లమంటుంది కనకవ్వ. ఊళ్లో బతకడం కష్టమవుతుందని హైదరాబాద్ ధూల్‌పేటలో పదేళ్లు ఉన్నామని…చిన్నపిల్లలను పెద్ద పిల్లలకు అప్పజెప్పి ఇళ్లల్లో పనులు చేసి..పిల్లలను బతికించుకుంటానికి ఒక్కో పైస దాచిపెట్టేదాన్ని అంటోంది కనకవ్వ.
హైదరాబాద్ నుంచి గోదావరిఖని వెళ్లి అక్కడ వాడవాడలా తిరుగుతూ పండ్లు అమ్ముకుంటూ కూలిపనులకు వెళ్లేది. ఏ పని చేసినా పిల్లల గురించే చేసినా…ఇప్పుడు పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. సంతోషంగా ఉన్నారు.
నేనేదో సరదాగా పాడుకుంటుంటే నా మనవళ్లు వీడియో తీసి వైరల్ చేశారని ముసిముసి నవ్వులు నవ్వుతోంది కనకవ్వ. దాంతో తనా పాట అందరికీ తెలిసిపోయిందని..చాలా సంతోషంగా ఉందంటున్నారు.
చిన్నతనం నుండి అమ్మ లాలన పాలన… అమ్మ నేర్పించే పాటలు… పొలాలకు వెళ్లేటప్పుడు పాడే పాటలే… తనకు ఇప్పుడు ఈ పేరు తెచ్చిపెట్టాయంటుంది కనకవ్వ.
చూసినోళ్లు వెంటనే గుర్తుపడుతున్నారని… ‘నువ్వు కనకవ్వవు గదూ! నీ పాటలు శాన బాగుంటయ్ ’అని చెబుతుంటే ఇన్నేళ్లు పడ్డ కష్టమంతా కరిగిపోయినట్లు అనిపిస్తోందని మురిసిపోతోంది. ఇన్నాళ్లు తనకు తెలిసిన పాటలు పాడేది…ఇప్పుడు వేరేవాళ్లు రాసిన పాడుతోంది. ఆ జానపద పాట రాసిన వాళ్లు ఒక్కసారి పాడి వినిపిస్తే చాలు… ఆ పదాలు గుర్తుపెట్టుకొని పాడేస్తుంది.
ఈ తరానికి నువ్వేం చేప్తావ్ గంగవ్వ అంటే..?
జీవితంలో బాధలు వస్తుంటాయ్…పోతుంటాయ్…దిగులు పడవద్దు. ఏదో ఒక రోజు అంతా మంచే జరుగుతుంది. కాస్త ఓపిక పట్టాలి అంటోంది. మనకంటూ ఒక రోజు రాసి ఉంటుంది… ఆ రోజు వరకు మన పని మనం చేసుకుంటూ పోవాలి అని నేటితరానికి ఎంతో స్ఫూర్తినిస్తోంది కనకవ్వ. నాగరిక ప్రపంచం ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాల్లోకి ఒదిగి తనను తాను వెతుక్కునే పనిలో ఎప్పుడూ ఉంటుంది. ఆ వెతుకులాటలో పల్లె తన కళను ఎప్పుడూ దోసిళ్ల కొద్ది నిండుగా అందిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లె కోయిలమ్మ కనకవ్వ రూపంలో మనల్ని అలరిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Peddapalli, Social Media, Telangana, Trending news, Youtube stars