Home /News /trending /

YOUTH RIDE SCOOTY IN REVERSE WITH UNIQUE TECHNIQUE STYLE SHOCKING VIDEO VIRAL ON SOCIAL MEDIA NK

Video: వామ్మో... ప్రపంచంలో ఎవ్వరూ బైక్ ఇలా నడపరు!

ఇదేం నడపడం (image credit - instagram)

ఇదేం నడపడం (image credit - instagram)

Viral Video: బైక్ నడపడంలో కొత్త పద్ధతి కనిపెట్టారు వాళ్లు. అలా నడపాలని ఎవ్వరూ అనుకోరు. కానీ ఈ వీడియో మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

    Video: బైక్ రైడింగ్ అన్నా, బైక్ స్టంట్ (bike Stunt videos) వీడియోలన్నా చాలా మంది యువతకు క్రేజ్. బైక్ అందరూ నడుపుతారు. కానీ స్టంట్స్ చేసేవాళ్లు ఎవరూ నడపని విధంగా నడుపుతారు. కొంత మంది బైక్ పైకి ఎక్కి నిల్చొని నడుపుతారు (Bike riding), మరికొందరు ఫ్రంట్ లేదా బ్యాక్ టైర్ గాల్లోకి లేపి నడుపుతారు. మరికొందరు... వెనక్కి తిరిగి బండిపై దూసుకుపోతారు. ఇలా స్టంట్ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని స్టంట్లు ఫెయిలవుతాయి (Stunt Fail videos). కొన్ని సక్సెస్ అవుతాయి. మొత్తంగా ఆ వీడియోలకు ఉండే క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.

    రివర్స్ డ్రైవింగ్:
    ఇప్పుడు మనం చూడబోయేది స్టంటో, ఏంటో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇందులో ఓ యువకుడు స్కూటీని రివర్సు (opposite)లో కూర్చొని... స్కూటీని రివర్సు (reverse driving)లో నడిపాడు. అసలు అలా ఎలా నడిపాడన్నది వీడియో చూసిన మొదటి క్షణం వచ్చే డౌట్. అతను రివర్సులో కూర్చుంటే.. స్కూటీ ఎలా వెళ్లగలుగుతోందనే డౌట్ అంత ఈజీగా తీరదు. పైగా.. అతను బైక్ నడిపినట్లుగా... స్కూటీపై రివర్సులో కూర్చొని నడుపుతూ వెళ్లడం, పెట్రోల్ బంక్ చుట్టూ రౌండ్లు వెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

    స్కూటీలో మార్పులు:
    వీడియోని జాగ్రత్తగా గమనిస్తే ఓ విషయం అర్థమవుతుంది. బైక్‌కి ముందు హ్యాండిల్ ఉన్నట్లే... వెనక సీటుకి కూడా ఆ కుర్రాడు హ్యాండిల్స్ పెట్టాడు. వాటికే బ్రేక్స్, క్లచ్ అన్నీ సెట్ చేశాడు. అందువల్ల బైక్ అతను చెప్పినట్లుగా వెళ్తోంది. కాకపోతే చూడ్డానికి మాత్రం ఇలా ఎవరూ నడపరే అనిపించేలా ఉందీ వీడియో

    వీడియోని ఇక్కడ చూడండి.



    ఇది కూడా చదవండి: Thrilling Leopard video: పర్వతం నుంచి కిందపడినా వేట వదలని చిరుత!

    యూనిక్ టాలెంట్:
    ఇలా బైక్‌లో రివర్స్ మార్పులు చేయడం ద్వారా తనకు టెక్నికల్ టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు ఆ కుర్రాడు. రైళ్లకు రెండువైపులా ఇంజిన్ తగిలించవచ్చు. అదే విధంగా ఇతను రెండువైపులా బండి నడిపేలా చేసుకున్నాడు. దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు గానీ... తనకూ క్రియేటివ్ ఆలోచనలున్నాయని చెప్పేందుకు ఈ వీడియో ఉపయోగపడుతోంది. రెండ్రోజుల కిందటే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోని 42వేల మందికి పైగా చూశారు. యూనిక్ వీడియోలను ఎప్పుడూ నెటిజన్లు హిట్ చేస్తారు. అందుకు ఇదే నిదర్శనం.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Bike, Viral, VIRAL NEWS, Viral Video, Viral Videos

    తదుపరి వార్తలు