దేశ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. చలిని తట్టుకోవడానికి ఎవరికి వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మధ్యప్రదేశ్ (Madhya pradesh)లో ఇద్దరు యువకులు చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. మోటర్ సైకిల్(Motorcycle)పైనే చలి మంట వేసుకున్నారు. వేడి కోసం వెనుక కూర్చున్న యువకుడు సీటుపై పొయ్యిని ఏర్పాటు చేసుకొని సిగరెట్(Cigarette)తాగుతూ బైక్‌పై నడిరోడ్డుపై వెళ్తుండగా కొందరు వీడియో(Video viral) తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
నిప్పుతో చెలగాటం..
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని విజయ్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. చలిని తట్టుకునేందుకే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తూ వెనుక కూర్చున్న వ్యక్తి సీటుపై చలి మంట వేసుకొని అందర్ని విస్మయానికి గురి చేసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా పెట్రోల్ వాహనంపై పొయ్యిని ఏర్పాటు చేసికొని సరదాగా సిగరెట్ తాగుతూ బైక్ నడుపుకుంటూ వెళ్తుంటే రోడ్డుపై వెళ్తున్న వాళ్లంతా షాక్‌కు గురయ్యారు.
పోకిరి వెదవలు..
ఏదో కశ్మీర్‌లో విహారయాత్రకు వెళ్లినంత సరదాగా బైక్‌పై మంటలు పెట్టుకొని నడిరోడ్డుపై వెళ్తుండగా పాదచారాలు తమ సెల్‌ఫోన్‌తో వాళ్ల ఓవర్ యాక్షన్ దృశ్యాన్ని వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
వీడియో వైరల్ ..
ఇద్దరు కుర్ర వెదవలు చేసిన ఆకతాయి చేష్టలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉన్నందున ఇలాంటి చర్యలకు పాల్పడిన యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, VIRAL NEWS, Viral Video