Viral Video: డాన్స్ స్టెప్స్... 814 మంది దగ్గర నేర్చుకున్నాడు... ఆ తర్వాత వీడియో చేశాడు

డాన్స్ స్టెప్స్... 814 మంది దగ్గర నేర్చుకున్నాడు (image credit - instagram)

Viral Video: సాధారణంగా ఎవరికైనా డాన్సర్ ఒకరో, ఇద్దరో ఉంటారు. అతను ప్రపంచమంతా తిరిగి ఏకంగా 814 మంది నుంచి స్టెప్స్ నేర్చుకున్నాడు. అతని వీడియో సూపర్ వైరల్ అయ్యింది.

  • Share this:
    Viral Video: మనం ఎన్నో రకాల వైరల్ వీడియోలు రోజూ చూస్తూ ఉంటాం. వాటిలో కొన్ని వర్త్ ఫుల్‌గా ఉండవు. ఇందులో ఏముంది... కామనేగా అనిపిస్తాయి. కొన్ని మాత్రం... ఓ మంచి వీడియో చూసిన ఫీల్ కలిగిస్తాయి. ఫన్ జనరేట్ చేస్తాయి. మనలో కొత్త ఉత్సాహం ఇస్తాయి. అలాంటి వీడియో ఇది. ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన డాన్స్ మూమెంట్స్ ఉంటాయి. అందరూ అన్ని రకాలూ నేర్చుకోలేరు. అలా నేర్చుకోవాలంటే... ప్రపంచమంతా తిరగాలి. అతను తిరిగాడు. ప్రపంచంలోని చాలా మందిని ఒకటి చేస్తూ... వీడియో చేశాడు. అందులో వేర్వేరు దేశాల్లో ప్రజలు... వేర్వేరు స్టెప్స్ అతనికి నేర్పించారు. అలా మొత్తం 814 మంది నుంచి 490 రకాల స్టెప్స్ నేర్చుకున్నాడు.

    అతని పేరు ఎడ్ (Ed). వివిధ దేశాలకు తను వెళ్లిన చోట వేసే స్టెప్స్ చూసి... వాటిని తనకూ నేర్పించాలని అడిగేవాడు. వాళ్లు సరదాగా నేర్పించేవాళ్లు. ఆ క్లిప్స్ అన్నీ కలిపి... వీడియో చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో Ed.people అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఎడ్ ప్రకారం... అతను మొత్తం 490 మూమెంట్స్ నేర్చుకున్నాడట. 100 రోజుల్లో ఇలా చేశానని చెప్పాడు.








    View this post on Instagram






    A post shared by Ed (@ed.people)






    ఈ స్టెప్స్ అదిరిపోయేలా ఉన్నాయా... సాధారణంగా ఉన్నాయా అన్నది పక్కన పెడితే... ఇలాంటి ప్రయత్నం చెయ్యడం నెటిజన్లకు బాగా నచ్చింది. ఈ వీడియో తమకు ఎంతగానే హ్యాపీ కలిగించిందని చాలా మంది కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. కష్టమైన దాన్ని చేసి... చిన్న వీడియోగా కంపైల్ చెయ్యడం బాగుందని అంటున్నారు.

    ఇది కూడా చదవండి: చుట్టూ కుక్కలు... మధ్యలో ఆమె డాన్స్... హేమామాలినీ ఇన్స్‌పిరేషన్... వీడియో వైరల్

    నెటిజన్లకు ఇంతలా నచ్చడంతో ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఇది చూసి... తాము కూడా కొత్త స్టెప్స్ నేర్చుకుంటున్నామని అంటున్నారు. ఇది చూసినప్పుడు మొత్తం ప్రపంచాన్ని చూసినట్లు ఉందని ఓ యూజర్ చెప్పగా... గ్రేట్ ప్రాజెక్ట్... బాగా చేశావ్ అని మరో యూజర్ మెచ్చుకున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: