YOUTH DRAGGING CROCODILES TAIL IN TAMILNADU VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA GH SRD
Crocodile: మొసలితో యువకుల పరాచకాలు.. తోక పట్టుకుని మరీ ఆటలు..చివరికి ఏం జరిగిదంటే..
Photo Credit : Twitter
Crocodile : సాధారణంగా మొసలిని చూడగానే భయంతో ఆమడ దూరం పారిపోతాం. ఒక్కసారి మొసలి చేతికి చిక్కామంటే ఇక అంతే సంగతులు మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇలాంటి భయంకరమైన మొసలితో పరాచకాలు ఆడారు కొంత మంది యువకులు.
సాధారణంగా మొసలిని చూడగానే భయంతో ఆమడ దూరం పారిపోతాం. ఒక్కసారి మొసలి చేతికి చిక్కామంటే ఇక అంతే సంగతులు మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇలాంటి భయంకరమైన మొసలితో పరాచకాలు ఆడారు కొంత మంది యువకులు. అంతటితో ఆగకుండా మొసలితో ఆడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన అటవీ శాఖ అదికారులు యువకులపై వన్యప్రాణల సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి సిద్దమయ్యారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లా ముక్కొంబు బ్యారేజీ వద్ద చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉండే కొంత మంది యువకులు బ్యారేజీ వద్దకు వెళ్లారు. అదే సమయంలో అక్కడి వాగులో మొసలి కన్పించడంతో ఎటువంటి భయం లేకుండా దాని తోక పట్టుకొని పరాచకాలాడుతూ వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది. వీడియో జిల్లా అటవీ అధికారుల దృష్టిలో పడటంతో యువకులను పట్టుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు..
ఈ ఘటనపై జిల్లా అటవీ అధికారి సుజాత మాట్లాడుతూ, "వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972లోని షెడ్యూల్ - I (పార్ట్ - II) కింద మొసళ్లకు రక్షణ కల్పించబడింది. మొసళ్ల స్వేచ్ఛను అడ్డుకోవడం, వాటిని వేధించడం, వాటి ప్రశాంతతను దెబ్బతీయడం, వేటాడటం వంటివి చేస్తే వారికి జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది. ఈ చట్టం క్రింద ఆ యువకులపై చర్యలు తీసుకుంటాం. మరోవైపు వైరల్ అయిన వీడియోలో మొసలి ఎటువంటి కదలిక లేకుండా ఉంది. దీన్ని బట్టి చూస్తే అది చనిపోయినట్లు కన్పించింది. దాని ఆచూకీ తెలుసుకోవడానికి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాము. సాధారణంగా ఇటువంటి మొసళ్ళు మాయనూర్ బ్యారేజ్, కుడమురుతి, కల్లనై ఆనకట్ట, ఉయకొండన్ కాలువ వంటి ప్రాంతాలలో కనిపిస్తాయి. కానీ ముక్కొంబు బ్యారేజ్ ప్రాంతంలో ఇలా మొసళ్లు కన్నించడం చాలా అరుదైన సన్నివేశం. కావేరి నది బలమైన ప్రవాహంతో ఇది కొట్టుకొని ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నాం. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది." అని అన్నారు.