నాతో నీవు లేకపోవచ్చు.. కానీ నీపై నా ప్రేమ శాశ్వతం. నీ జ్ఞాపకాలు నా హృదయంలో ఎప్పటికీ పదిలం అంటూ ఆ ప్రేమికుడు.. మరణించిన తన ప్రేయసి నుదుట సింధూరం బొట్టు పెట్టాడు. ఆమెను పెళ్లాడాలనుకున్న కోరికను ఇలా తీర్చుకున్నాడు. అసోంలోని.. ప్రార్థనా బోరా.. ఓ ప్రాణాంతక వ్యాధితో పోరాడి.. శుక్రవారం మృత్యు ఒడిలోకి చేరుకుంది.
విగతజీవిగా మారిన ఆమెను చూసేందుకు వచ్చిన ప్రేమికుడు బితుపన్ తిములి.. భారమైన హృదయంపై నుదుట కుంకుమ పెట్టాడు. అది చూసి అక్కడున్న వారంతా కన్నీరు పెట్టారు. వారి హృదయాలు ద్రవించిపోయాయి. "మరణం మనల్ని దూరం చెయ్యలేదు" అని బితుపన్ చెప్పగానే.. అక్కడి వారు చలించిపోయారు. అతని కోసమైనా ఆమె తిరిగి బతికితే బాగుండు అనుకున్నారు.
నిజ జీవితంలో ఇలాంటి ప్రేమను మనం అరుదుగా చూస్తుంటాం. ఇలాంటి దృశ్యాలు సినిమాల్లోనే కనిపిస్తాయి. ప్రార్థనను లోతుగా ప్రేమించిన బితుపన్కి ఆమే సర్వస్వం అయ్యింది. నాగావ్కి చెందిన ఆమె చాలా కాలంగా ప్రాణాంతక వ్యాధితో పోరాడింది. ఆమెను ప్రాణంగా ప్రేమించిన బితుపన్.. ఆమెతో బంగారు భవిష్యత్తును ఊహించుకున్నాడు. ఎన్నో కలలు కన్నాడు. ఆ క్రమంలోనే ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ విధి రాత మరోలా ఉంది. ప్రార్థన అతన్ని వదిలేసి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమెతో నిండు నూరేళ్లూ కలిసి జీవించాలనుకున్న బితుపన్కి కన్నీటి జ్ఞాపకాలే మిగిలాయి.
తనకు ప్రతీ క్షణం ఆనందాన్ని మిగిల్చి.. తాను మాత్రం బాధతో వెళ్లిపోయిన ప్రార్థనను చూసి.. బితుపన్ కుప్పకూలాడు. తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఆమె చివరి కోరిక తీర్చాలనుకున్నాడు. అందుకే ఆమె చనిపోయినా.. నుదుట కుంకుమ బొట్టు పెట్టి.. పెళ్లాడాడు. వరమాలను ఆమె మెడలో వేశాడు. స్వర్గంలో ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నాడు.
Memes : పవర్ఫుల్ ఫన్నీ మీమ్స్.. పట్టింపుల టోల్స్.. టాలీవుడ్ అప్డేట్స్
నిజమైన ప్రేమంటే ఇదే కదా. ఇంతకు మించిన ప్రేమను ఎవరు చూపిస్తారు? అందుకే ఈ ప్రేమ కథ యువతను కదిలిస్తోంది. ప్రేమికులంతా.. ఈ కథ తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love, National News