‘నీ డ్రెస్ బాగోలేదు.. దించేస్తాం’: మహిళా పాసింజర్‌కు విమాన సిబ్బంది వార్నింగ్, తర్వాత..

ఆమె వేసుకున్న డ్రెస్ మీద మరో జాకెట్ వేసుకోవాలని సూచించారు. లేకపోతే విమానంలో నుంచి దించేస్తామని హెచ్చరించారు.

news18-telugu
Updated: March 14, 2019, 3:47 PM IST
‘నీ డ్రెస్ బాగోలేదు.. దించేస్తాం’: మహిళా పాసింజర్‌కు విమాన సిబ్బంది వార్నింగ్, తర్వాత..
ఎమిలీ ఓ కానర్ (Twitter)
  • Share this:
ఓ మహిళా ప్రయాణికురాలి దుస్తులు సరిగా లేవంటూ ఆమెను దించేస్తామని బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎమిలీ ఓ కానర్ అనే మహిళ థామస్ కుక్ ఎయిర్‌లైన్స్‌లో యూకేలోని బర్మింగ్‌హా‌మ్ నుంచి క్యానరీ ఐలాండ్స్‌కు వెళ్తోంది. బర్మింగ్ హా‌మ్ విమానాశ్రయంలో ఆమె థామస్ కుక్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కింది. అయితే, అందులో ఉన్న సిబ్బంది ప్రయాణికురాలి డ్రెస్‌పై (పై ఫొటో చూడొచ్చు) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె వేసుకున్న డ్రెస్ మీద మరో జాకెట్ వేసుకోవాలని సూచించారు. లేకపోతే విమానంలో నుంచి దించేస్తామని హెచ్చరించారు. ఫ్లైట్‌లో సహాయకులుగా ఉండే నలుగురితో పాటు మేనేజర్ కూడా ఆమెను దింపేస్తామని హెచ్చరించారు.

థామస్‌కుక్ ఎయిర్‌లైన్స్ నిర్వాకంపై బాధితురాలు ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన ఎయిర్‌లైన్స్ ఆమెకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పింది. ‘ఆ పరిస్థితిని మా సిబ్బంది మరింత మెరుగ్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది.’ అని అభిప్రాయపడింది. ప్రతి విమానయాన సంస్థలాగే తమకు కూడా ఓ పాలసీ ఉందని, మహిళ, పురుషులు అనే భేదం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలు చేస్తామని తెలిపింది.
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading