Aadhaar: ఆధార్ కార్డు వాడట్లేదా? డీయాక్టివేట్ అయిపోతుంది

Aadhaar | పిల్లలు ఐదేళ్ల లోపు ఉన్నప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నట్టైతే, వారి వయస్సు ఐదేళ్లు దాటిన తర్వాత బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయించడం తప్పనిసరి.

news18-telugu
Updated: May 15, 2019, 2:45 PM IST
Aadhaar: ఆధార్ కార్డు వాడట్లేదా? డీయాక్టివేట్ అయిపోతుంది
Aadhaar: ఆధార్ కార్డు వాడట్లేదా? డీయాక్టివేట్ అయిపోతుంది
news18-telugu
Updated: May 15, 2019, 2:45 PM IST
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI జారీ చేసే ఆధార్ కార్డు అందరికీ ముఖ్యమైన డాక్యుమెంట్. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌తో పాటు ఇతర పథకాలకు ఆధార్ తప్పనిసరి. అయితే కొన్ని కారణాల వల్ల ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మీ ఆధార్ స్టేటస్ ఏంటో UIDAI పోర్టల్‌లో తెలుసుకోవడం మంచిది. వరుసగా మూడేళ్ల పాటు ఆధార్ కార్డ్ ఉపయోగించకపోతే ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ కావొచ్చు. మీరు మీ ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డుకు లింక్ చేయకపోయినా, పెన్షన్ కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO వెబ్‌సైట్‌లో ఆధార్ వివరాలు ఇవ్వకపోయినా మీ ఆధార్ డియాక్టివేట్ అయ్యే అవకాశముంది. ఇక మీ పిల్లలు ఐదేళ్ల లోపు ఉన్నప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నట్టైతే, వారి వయస్సు ఐదేళ్లు దాటిన తర్వాత బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయించడం తప్పనిసరి. పిల్లల వయస్సు 15 ఏళ్లు దాటిన తర్వాత మరోసారి బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయించాలి. లేకపోతే ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుంది.

Read this: SSY Scheme: రోజుకు రూ.100 పొదుపుతో రూ.16 లక్షల రిటర్న్స్...

మరి మీ ఆధార్ కార్డ్ యాక్టీవ్‌లో ఉందా? లేక డీయాక్టివేట్ అయిందా అన్న విషయం సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి. My Aadhaar సెక్షన్‌లో Aadhaar services లిస్ట్‌లో Verify an Aadhaar Number పైన క్లిక్ చేయండి. కొత్త పేజీలో ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ యాక్టీవ్‌లో ఉందా లేకా డీయాక్టివేట్ అయిందా అన్న విషయం తెలుస్తుంది. గ్రీన్ టిక్ కనిపిస్తే మీ ఆధార్ యాక్టీవ్‌లోనే ఉన్నట్టు. ఒకవేళ మీ ఆధార్ డీయాక్టివేట్ అయినట్టు మెసేజ్ కనిపిస్తే మీరు అప్రమత్తం కావాల్సిందే.

Read this: LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇచ్చేయండి ఇలా



మీ ఆధార్ డీయాక్టివేట్ అయితే దగ్గర్లోని ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. UIDAI వెబ్‌సైట్‌లో దగ్గర్లో ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ ఫామ్ తీసుకొని వివరాలు పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ బయోమెట్రిక్స్ వెరిఫై చేయడంతో పాటు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు రూ.25 చెల్లిస్తే చాలు.

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్


ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...

Realme C2: ఎక్స్‌ఛేంజ్‌లో రూ.2,000 ధరకే రియల్‌మీ సీ2... కొందరికి మాత్రమే

IndiGo Sale: 10 లక్షల సీట్లు... రూ.999 నుంచి టికెట్లు
First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...