చత్తీస్గడ్(Chhattisgarh)లో అందరూ చూస్తుండగానే ఘోర ప్రమాదం జరిగింది. దుర్గ్(Durg)రైల్వే స్టేషన్ (Railway Station)కు అమృత్సర్ టు బిలాస్పూర్ రైలు(Amritsar Bilaspur Train)వచ్చి నాల్గో నెంబర్ ఫ్లాట్ ఫామ్‌లో ఆగింది. ఇంతలో ఓ యువకుడు రైలు బోగీలపై నిలబడ్డాడు. ట్రైన్ ఆగిపోవడంతో అతడ్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ట్రైన్ పైకి ఎక్కిన యువకుడు అటు ఇటు చూస్తూ అక్కడే ఉన్న హైటెన్షన్ లైన్(High tension line)ను పట్టుకోవడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. యువకుడికి కరెంట్ షాక్ తగిలి పిట్టలా పడిపోయాడు.
లైవ్ సూసైడ్ అటెంప్ట్..
రైల్వే స్టేషన్లో పెద్దగా బాంబు పేలిన శబ్ధం రావడంతో అంతా గందరగోళం నెలకొంది. అక్కడున్న ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బంది భయపడిపోయారు. యువకుడి మంటలు అంటుకొని కిందపడటంతో వెంటనే స్టేషన్లో డ్యూటీ నిర్వహిస్తున్న రైల్వే పోలీసులతో పాటు జీఆర్పీ సిబ్బంది ఘటన స్తలానికి చేరుకున్నారు. మంటల్లో గాయపడిన యువకుడ్ని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన యువకుడు..
ట్రైన్ బోగిపైకి ఎక్కి హైటెన్షన్ లైన్‌ను పట్టుకొని తీవ్రంగా గాయపడిన యువకుడి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్ మెకహారాకు తరలించారు. అయితే యువకుడు తనంతట తానే సూసైడ్‌కి పాల్పడిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కేసు నమోదు చేసకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో..
ఈ మొత్తం వీడియో చూస్తుంటే హైటెన్షన్ లైన్‌ను పట్టుకున్న యువకుడు ఉద్దేశ పూర్వకంగానే చనిపోయేందుకు ప్రయత్నించాడా లేక సోషల్ మీడియాలో రీల్స్, టిక్‌టాక్ వీడియోల కోసం ఇంతటి సాహసానికి పాల్పడ్డాడో అర్ధం కావడం లేదని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపేందుకు సీసీ ఫుటేజ్‌ని సైతం పరిశీలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatisghad, Trending news, Viral Video