• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • YOUNG MAN WAS CROSSING THE ROAD QUICKLY AND SAVE THE GIRL VIRAL VIDEO GETS GOOD RESPONSE ON SOCIAL MEDIA NK

Viral video: ప్రాణాలకు తెగించిన యువకుడు.. చిన్నారి సేఫ్.. సూపర్‌మేన్ అంటున్న నెటిజన్లు

Viral video: ప్రాణాలకు తెగించిన యువకుడు.. చిన్నారి సేఫ్.. సూపర్‌మేన్ అంటున్న నెటిజన్లు

ప్రాణాలకు తెగించిన యువకుడు.. చిన్నారి సేఫ్ (image credit - twitter)

Viral video: మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం... ఆపద సమయంలో... సూపర్‌మేన్ వచ్చి కాపాడేస్తాడు. అలాంటి ఘటన రియల్‌గా జరిగింది. ఆ కుర్రాడు క్షణాల్లో సూపర్‌మేన్ అయిపోయాడు. వీడియో చూద్దాం.

  • Share this:
    Viral video: రోడ్డు ప్రమాదం ఎప్పుడైనా క్షణాల్లోనే జరుగుతుంది. రెప్పపాటులో ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. కానీ ఆ సమయంలో... అప్రమత్తంగా ఉంటే... ప్రమాదాన్ని ఆపొచ్చు. అదంత తేలిక మాత్రం కాదు. ఆ యువకుడు అది చేసి చూపించాడు. అదో సాధారణ వీధి రోడ్డు. అటూ ఇటూ వాహనాలు వేగంగానే వెళ్తున్నాయి. ఓ యువతి, ఓ కుర్రాడు రోడ్డు దాటేందుకు ఎదురుచూస్తున్నారు. వాహనాలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. దాంతో వారు రోడ్డు దాటేందుకు వీలు లేకుండా ఉంది. అయితే... వారికి ఎదురుగా... రోడ్డుకు అటువైపున ఓ చిన్నారి... చూసుకోకుండా... రోడ్డుపైకి వచ్చేస్తుంటే... అది గమనించిన కుర్రాడు... రెప్పపాటులో... రోడ్డు దాటేసి... చిన్నారిని పట్టుకొని... క్షణాల్లో రోడ్డుకు అటువైపు వెళ్లిపోయాడు.

    ఆ కుర్రాడు ఒక్క క్షణం ఆలస్యం చేసినా... పాపతోపాటూ... అతన్ని కూడా అటుగా వచ్చిన వాహనం గుద్దేసేదే. అంత వేగంగా అతను స్పందించడం వల్లే ఆ ప్రమాదం జరగలేదు. ఇలా అతను తన ప్రాణాలను అడ్డుగా పెట్టి... రియల్ హీరోలా ముందడుగు వేశాడు. అందుకే అంతా అతన్ని మెచ్చుకుంటున్నారు. సూపర్ హీరో అంటున్నారు.







    ఇది కూడా చదవండి: Ants in House: ఇంట్లోకి చీమలు వస్తున్నాయా... ఇలా చేస్తే పరార్... సింపుల్ టిప్స్

    ఈ వీడియోని రెక్స్ చాప్‌మాన్ ట్విట్ చేశారు. ఈ వీడియోని నెటిజన్లు విపరీతంగా చూస్తున్నారు. లైక్స్, కామెంట్స్ ఫుల్లుగా వస్తున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు