Viral Video : గుట్కా,పాన్‌పరాగ్ నమిలేవారు ఎక్కడపడితే అక్కడ ఊస్తుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో గుట్కా,పాన్ పరాగ్ లను నమిలి ఎక్కడపడితే అక్కడ ఊస్తుండటం మనం చూడవచ్చు. బస్సుల్లో,రైళ్లల్లో కూడా ఇంతే. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే..వారిపై దాడులు చేయడానికి కూడా వెనకాడరు కొందరు. అయితే దక్షిణ భారతదేశంలో ఇది అత్యంత అరుదుగా కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో అక్కడక్కడా రోడ్లపై గుట్కాలు,పాన్ పరాగ్ లు నమిలి ఊసే వాళ్లు కూడా ఎక్కువ ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి పనుల కోసం వచ్చిన వాళ్లే. మరోవైపు, కొద్దినెలలుగా విమానాల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలను కలవరపెడుతున్నాయి, ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే తాజాగా విమానంలో గుట్కా ప్రియుడు చేసిన తతంగం వీడియో బాగా వైరల్ అవుతోంది.
videonation.teb అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయబడిన ఓ వీడియోలో..ఫ్లైట్ జర్నీలో ఓ యువకుడు ఏదో మాట్లాడి అందరినీ షాక్ కి గురి చేశాడు. వాస్తవానికి, యువకుడు ఎయిర్‌హోస్టెస్‌ని తన వద్దకు పిలిచి విమానం కిటికీని తెరవమని ఆమెను కోరడం వీడియోలో కనిపిస్తుంది. ఇది విని ప్రయాణీకులు, ఎయిర్‌హోస్టెస్ షాక్ అయ్యారు. కానీ కారణం అడిగిన వెంటనే అతని నుంచి వచ్చిన సమాధానం ఊహకందనిది. యువకుడు ఒక చేతిలో మరో చేతి వేలితో ఏదో రుద్దుతూ గుట్కా ఉమ్మివేయాలనుకుంటున్నా కిటికీ తెరవండి అని అన్నాడు యువకుడు. అది విని ఎయిర్ హోస్టెస్ తో పాటు ప్రయాణికులు కూడా నవ్వారు. అయితే ఆ యువకుడు ఇదంతా తమాషాగా చేసినట్లు అర్థమవుతోంది. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
Kerala: న్యూయార్క్ టైమ్స్-2023 చూడదగ్గ ప్రదేశాల లిస్ట్‌లో కేరళ ..ఇండియా నుంచి ఒకటే రాష్ట్రం
మరోవైపు, కొద్ది నెలల క్రితం విమానంలో కిటికీ వద్ద కూర్చొని ప్రయాణించిన ఓ వ్యక్తి విండో వద్ద గుట్కాను ఊశాడు. దీంతో అక్కడ మరక పడింది. ఆ విమానంలో ప్రయాణించిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్.. కిటికీ వద్ద గుట్కా మరక ఉండటాన్ని గమనించారు. దీంతో తన మొబైల్ ఫోన్‌తో దాని ఫొటో తీశారు. అనంతరం ట్విట్టర్ లో "ఎవరో తన గుర్తింపును ఇలా వదిలివెళ్లారు" అని హిందీలో పేర్కొంటూ ఆ ఫొటోను పోస్ట్ చేశారు.విమానంలో గుట్కా ఉమ్మిన వ్యక్తిపై ఈ మేరకు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. విమానంలో గుట్కా మరక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విమానంలో గుట్కాను ఊసిన వ్యక్తిపై నెటిజన్లు మండిపడ్డారు. ఇప్పటి వరకు బస్సులు, రైళ్లను అశుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు విమానాల్లో కూడానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight, Viral Video