పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన మట్టం. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. అందుకే ఖర్చుకు వెనకుండా అందరూ ఘనంగా పెళ్లి చేసుకుంటారు. నిశ్చితార్థం మొదలుకొని.. శుభలేఖలు, పెళ్లి మంటపం, భోజనాలు, బరాత్.. ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఓ యువకుడు కూడా ఇలాగే వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెళ్లి వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇదేం పెళ్లి..? ఇలాంటి వివాహాన్ని ఎప్పుడూ చూడలేని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఆ పెళ్లిలో వధువు ఎవరో తెలుసా.. అందమైన యువతి కాదు.. ఒక మేక. అవును ఓ యువకుడు మేకను పెళ్లి చేసుకున్నాడు.
పాకిస్తాన్‌లో సింధు ప్రావిన్స్‌లో ఈ వివాహం జరిగింది. పాతికేళ్ల యువకుడు మేకను పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాహ వేడుక జరిగింది. బంధు మిత్రులంతా తరలి వచ్చి.. పెళ్లిని వీక్షించి.. వధూవరులను ఆశీర్వదించారు. వరుడితో పాటు ఆ మేక కూడా ఏడడుగులు నడించింది. ఐతే అక్కడ ఏం జరుగుతుందో దానికి తెలియదు. అందుకే ముందుకు వెళ్లేందుకు మొండికేసింది. ఒ వ్యక్తి మేకను చేతితో పట్టుకొని, ముందుకు నడిపించగా.. దానిని వరుడు అనుసరించాడు. బుడిబుడి నడకలు వేస్తున్న మేకను చూసి బంధువులంతా పగబడి నవ్వారు. పనౌతి అనే ట్విటర్ యూజర్ తన ఖాతాలో వీడియోను పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది.
Young Boy Marry Video With Goat pic.twitter.com/xG75ppDrAS
— पनौति (@panauti96) August 4, 2021
ఐతే ఆ యువకుడు మేకను ఎందుకు పెళ్లి చేసుకున్నాడన్న వివరాలు తెలియాల్సి ఉంది. వివాహ దోషం తొలగించుకునేందుకు కొందరు ఇలాంటివి చేస్తుంటారు. చెట్టును పెళ్లి చేసుకోవడం.. వృద్ధుడితో వివాహం జరిపించడం వంటివి పలు సినిమాల్లోనూ దర్శమిచ్చాయి. అంతెందుకు తెలుగు చిత్రాల్లో కూడా గాడిదతో పెళ్లి చేసిన సీన్స్ కడుపుబ్బా నవ్వించాయి. అతడు జాతక దోషాన్ని తొలగించుకునేందుకే ఇలా చేశాడా? లేదంటే పబ్లిసిటీ పిచ్చిలో భాగంగా మేకను వివాహం చేసుకున్నాడా? అని నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తంగా ఈ వివాహం గురించి ఎవరికి తోచిన విధంగా వారు జోకులు పేల్చుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pakistan, Trending, Viral Video, Wedding