కళాకారుల్లో ఎవరి స్టైల్ వారిది. కొందరు కుంచెతో అందమైన చిత్రాలు గీస్తే మరికొందరు ఇసుకతో అద్భుతమైన బొమ్మలకు ప్రాణాలు పోస్తారు. కాని మధ్యప్రదేశ్(Madhya pradesh)కి చెందిన యువకుడు మాత్రం ఆహార పదార్ధాలు, ద్రవ పదార్ధాలతో పెయింట్స్ వేస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. సహజంగా ఎవరైనా టీ తాగుతారు. కాని జబల్ఫూర్(Jabalpur)కి చెందిన ఓ యువ కళాకారుడు తాగే టీ(Tea)తో అద్భుతమైన పెయింటింగ్(Painting)వేసి ఔరా అనిపించాడు. అయితే అతను వేసింది ఎవరి చిత్రాన్నో కాదు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ఫోటోను అచ్చు వేసినట్లుగా ఓ పేపర్‌పై చిత్రీకరించాడు.
వాటే టాలెంట్ గురూ ..
మధ్యప్రదేశ్ జబల్పూర్లోని రాంఝీ ప్రాంతానికి చెందిన సింటూ మౌర్య అనే యువకుడు తినే పదార్ధాలు, తాగే పానియాలతో కేవలం చేతి వేళ్లను బ్రష్‌గా మార్చుకొని అద్భుతమైన బొమ్మలు వేస్తున్నాడు. టమాటో సాస్, కచప్, ఉతికిన బట్టల నుంచి వచ్చే మురికి నీటిని ఉపయోగించి కళాకండాల్ని చిత్రీకరిస్తున్నాడు. తాజాగా తాగే టీతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోని వేశాడు సింటు మౌర్య. చిన్న టీ పొడిని డికాషన్‌గా స్టౌవ్ పై వేడి చేసి దాని ద్వారా వచ్చి డికాషన్‌ని ఓ పేపర్‌పై పోసి తన చేతి వేలితో ప్రధాని బొమ్మ గీశాడు.
టీ తో మోదీ ఫోటో వేసిన కళాకారుడు..
ఫింగర్ పెయింటింగ్ ఆర్టిస్టుల గురించి చాలా మందికి తెలుసు. కాని సింటూ మౌర్య తరహాలో తినే పదార్ధాలు, తాగే పానియాలతో బొమ్మలు వేయడం మాత్రం మొదటి సారి చూస్తున్నామంటున్నారు స్థానికులు. ఈ కళాకారుడి స్నేహితులు సైతం ఇతనిలోని టాలెంట్ చూసి అతనిలోని టాలెంట్, భిన్నమైన కళాతృష్ణను చూసి అభినందిస్తున్నారు. రీసెంట్గా ప్రధాని మోదీ ఫోటోని టీతో వేయడం చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నెట్టింట్లో చక్కర్లు ...
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లక్షల లైక్‌లు వచ్చాయి. ప్రముఖ భగవత్ కథకురాలు జయ కిషోరి చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి సింటూ మౌర్యా టాలెంట్‌ని దేశ ప్రజలతో పాటు నెటిజన్లకు చేరేలా చేశారు. సింటూ మౌర్య టాలెంట్ ఉపయోగించి టీ తో వేసిన ఫోటో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, National News, Viral Video