హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG : మద్యం మత్తులో మిత్రుడి మర్మాంగం కొరికిన యువకుడు .. వామ్మో తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

OMG : మద్యం మత్తులో మిత్రుడి మర్మాంగం కొరికిన యువకుడు .. వామ్మో తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

Drinker Attack

Drinker Attack

OMG: మందు సీసాలో ఉన్నంత సేపు మనిషి నిమ్మలంగా ఉంటాడు. ఆ సీసాలో మందు కాస్తా మనిషిలో పడిందో అంతే ఏం చేస్తున్నామో ..ఎందుకు చేస్తున్నామో కూడా ఆలోచించరు కొందరు మందుబాబులు. మెదక్ జిల్లాలో మద్యం మత్తులో ఓ యువకుడు స్నేహితుడ్ని ఏం చేశాడో తెలుసా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Medak, India

(K.Veeranna,News18,Medak)

మందు సీసాలో ఉన్నంత సేపు మనిషి నిమ్మలంగా ఉంటాడు. ఆ సీసాలో మందు కాస్తా మనిషిలో పడిందో అంతే ఏం చేస్తున్నామో ..ఎందుకు చేస్తున్నామో కూడా ఆలోచించరు కొందరు మందుబాబులు. మెదక్(Medak)జిల్లాలో స్నేహితుడితో కలిసి మద్యం దుణాని(Liquor shop)కి వెళ్లిన ఓ వ్యక్తి మందు నిషా నషాళానికి ఎక్కడంతో ఏం చేశాడో తెలిసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. తాగుబోతు స్నేహితుడు చేసిన దారుణానికి కిక్కు వదిలింది బాధితుడికి. ఏం చేయాలో ..ఏమనాలో తెలియక ..మత్తులోనే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం చూసి జనం ముక్కున వేలేసుకున్నారు.

Telangana : ఫైబర్ విగ్రహాలకు అతనే రూపకర్త .. బతుకమ్మ పండగ సీజన్‌తో చేతి నిండా ఉపాధి

మైకంలో మర్మాంగం కొరికాడు..

తాగుబోతుల మాటలకే కాదు వాళ్ల చేష్టలకు అర్దం లేకుండా పోతోంది. మద్యం మత్తుతో కళ్లు మూసుకుపోవడంతో ..ఏం చేస్తున్నామో ..అసలు ఇది చేయవచ్చా లేదా అనే ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోతున్నారు. మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో చేసిన దారుణానికి అతని స్నేహితుడు ఆసుపత్రి పాలయ్యాడు. అంతే కాదు సంసార సుఖానికి పనికి రాకుండా పోయాడు. పొడ్చన్‌పల్లి పరిధిలోని ఏడుపాయల కమాన్‌ సమీపంలో ఓ మద్యం దుకాణం ఉంది. అక్కడికి ఆల్కహాల్ తాగడానికి ఇద్దరు స్నేహితులు వచ్చారు. ఇద్దరూ కలిసి మందు తాగారు. అయితే తాగిన మందు డోసు మించిపోవడంతో ఇద్దరిలో ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

మద్యం కిక్కు ఎంత పని చేసే..

మద్యం మత్తు ఒంటికి ఎక్కడంతో తాగిన తిమ్మిరితో ఒక వ్యక్తి తనతో మద్యం తాగడానికి వచ్చిన స్నేహితుడి మర్మాంగాన్ని కొరికాడు. వెంటనే బాధితుడికి తీవ్రరక్త స్రావం కావడంతో మద్యం షాపు దగ్గర తాగుతున్న వాడు కాస్తా లేచి రక్తం కారుతుండగానే రోడ్డుపైకి వచ్చాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు మర్మాంగం కొరికిన వ్యక్తిని కొట్టారు. ఇలాంటి పని చేయడానికి సిగ్గు లేదా ..వాడి ప్రాణానికి ఏమైనా అయితే ఏం చేస్తావు అంటూ అందరూ తిట్టిపోశారు.

Telangana : 70దేశాల కరెన్సీ నోట్లు, ఓల్డ్ కాయిన్స్‌ సేకరించిన డాక్టర్ .. ఆయన ఇల్లే ఓ మినీ మ్యూజియం

ఆసుపత్రిలో చేరిన బాధితుడు..

గాయపడిన వ్యక్తి రక్తం కారుతూ తనపై దాడి చేసిన వ్యక్తి ఎందుకు చేశాడో తనకేం తెలుసు అంటూ మద్యం మత్తులో ఊగుతూనే తెలిపాడు. అయితే అక్కడున్న వాళ్లంతా వెంటనే ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చారు. అతను కదల్లేని పరిస్థితిలో ఉండటంతో 108కి కాల్‌ చేశారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Medak, Telangana News

ఉత్తమ కథలు