Viral Video : వీడి దుంప తెగ..వరుడు చూస్తుండగానే వధువుతో ఇలా చేస్తున్నాడేంటి..వీడియో చూస్తే మైండ్ బ్లాకే..

Photo Credit : Instagram

Viral Video : ఈ రోజుల్లో ఏ వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. కొన్నిసార్లు నవ్వు తెప్పించే వీడియోలు వైరల్ అయితే.. మరికొన్ని సార్లు ఆశ్చర్యానికి లోనయ్యే వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి.

  • Share this:
    కరోనా ప్రభావం తగ్గడంతో పెళ్లిళ్ల సీజన్‌ హవా నడుస్తోంది. దీంతో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో తరచూ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు వధూవరులు చేసిన పని నెటిజన్లు నవ్విస్తుంటే.. మరికొన్నిసార్లు వారి స్నేహితులు చేసే చిలిపి చేష్టలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ వీడియోలో వరుడు పరిస్థితి చూసి నవ్వకుండా ఉండలేరు. వరుడు ముందే వధువుతో ఓ వ్యక్తి ఏం చేశాడో చూసి పెళ్లికి వచ్చిన అతిధులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది చూడడానికి ఫన్నీగా కనిపిస్తున్న పెళ్లికొడుకు ముఖం చూస్తుంటే జాలి కలుగుతుంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదో కానీ ఈ వీడియో మాత్రం​ నవ్వులు పూయిస్తుంది. విషయంలోకి వెళితే.. రిసెప్షన్‌ సందర్భంగా వరుడు, వధువు స్టేజీపై కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక యువకుడు వేదిక మీదకు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుని వధువుకు ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారందరూ షాకయ్యారు. వీడి దుంప తెగ వరుడు చూస్తుండగానే ఇలా చేస్తున్నాడేంటి అని అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.

    ఆ వ్యక్తి తన భార్యను ఏం చేస్తున్నాడోనని పక్కనే ఉన్న వరుడు ఆసక్తిగా గమనించడం విశేషం. ఆ సమయంలో యువకుడు చర్యలకు వరుడు ముఖం పాలిపోవడం స్పష్టంగా కనిపించింది. అయితే పెళ్లికొడుకును ఏడిపించడానికే అమ్మాయి తరపు బంధువులు ఇలా ప్లాన్‌ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఏదేమైనా మరీ ఇంతలా దిగజారి ప్రవర్తించాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.



    ఈ వీడియోను *Official_niranjanm87* అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనితో దానిపై నెటిజన్లు భిన్నాభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతను వధువుకు తమ్ముడు అయి ఉంటాడని కామెంట్ చేయగా.. మరికొందరు ” పాపం! ఆ వరుడు పరిస్థితి మరీ దారుణంగా ఉందిగా” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: