హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: విమానంలో విండో కోసం గొడవ... యువతీ,యువకుల ఫన్నీ ఫైటింగ్.. వీడియో వైరల్..

Viral Video: విమానంలో విండో కోసం గొడవ... యువతీ,యువకుల ఫన్నీ ఫైటింగ్.. వీడియో వైరల్..

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక యువకుడు కూడా ఫ్లైట్ విండో నుంచి మంచి వ్యూ ఆస్వాదించాలి అనుకున్నాడు. కానీ అతడికి ఒక యువతి అడ్డుపడింది. ఆ తర్వాత...

బస్సు, ట్రైన్‌లో ప్రయాణించేవారు విండో సీట్ పక్కన కూర్చొని ప్రకృతి దృశ్యాలను చూస్తుంటే వచ్చే మజానే వేరు. ఇక గాల్లో విహరించే విమానం కిటికీ నుంచి కనిపించే దృశ్యాలు అత్యద్భుతంగా ఉంటాయి. అందమైన నీలాకాశం, చూపు తిప్పుకోనివ్వని మేఘాలు, పేకమేడల్లా కనిపించే ఇళ్లు, సముద్రాలు, పర్వతాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఏరోప్లేన్ కిటికీ నుంచి ఎన్నో చూడొచ్చు. అందుకే చాలామంది తమ గమ్యస్థానం వచ్చేంతవరకూ కళ్లార్పకుండా విండో నుంచి చూస్తూనే ఉంటారు. తాజాగా ఒక యువకుడు కూడా ఫ్లైట్ విండో నుంచి మంచి వ్యూ ఆస్వాదించాలి అనుకున్నాడు. కానీ అతడికి ఒక యువతి అడ్డుపడింది. యువకుడు విండో కిటికీ డోర్ ఓపెన్ చేయగానే.. ఆమె మాత్రం డోర్ క్షణాల్లోనే మూసేసింది. దీంతో విమానం గాల్లో ఉండగానే వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. గ్రెగొరీ హెర్నాండెజ్ అనే ఒక యువకుడు టిక్‌టాక్ లో ఓ ఫన్నీ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో విమానంలో వెనక సీట్ లో కూర్చున్న హెర్నాండెజ్.. అతని ముందు సీట్ లో కూర్చున్న ఒక యువతి కనిపించింది. అయితే వీరిద్దరి సీట్ల మధ్య ఒక విండో కనిపించింది. దానిని యువకుడు తెరుస్తుండగా యువతి క్షణం కూడా ఆలోచించకుండా మూసివేస్తుంది. నిజానికి ఈ విండోలో కొంత భాగమే యువతి సీట్ వైపు ఉంది. మిగతా మొత్తం భాగం యువకుడి వైపే ఉంది. దీంతో కిటికీ తెరిచి హాయిగా బయట అందమైన దృశ్యాలను వీక్షించాలని యువకుడు అనుకున్నాడు. కానీ అతడి ఆశలను వమ్ముచేస్తూ యువతి కిటికీ మూయడం ప్రారంభించింది.

' isDesktop="true" id="994524" youtubeid="A3YrP6tg3JU" category="trending">

ఇది చదవండి: యూజర్లను విసిగిస్తున్న గూగుల్.. తాము చెప్పిందే చేయాలంటూ ఒత్తిడి..ఇలా చాలాసార్లు జరగడంతో ఇద్దరిలోనూ కోపం పెరిగి పోయింది. ఒకరికొకరు ముక్కు మొహం తెలియకపోయినా వీరిద్దరూ చిన్న పిల్లలాగా ప్రవర్తించారు. మొరటుగా డోరు తీస్తూ.. మూస్తూ చిన్నపాటి గొడవకు దిగారు. చివరికి యువకుడు యువతి చేతిపై కొట్టాడు. వీరి గొడవకు సంబంధించిన వీడియో టిక్‌టాక్ లో ప్రత్యక్షం కాగా నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోకి ఇప్పటికే లక్షల వ్యూస్ వచ్చాయి. వేలాది కామెంట్లు వస్తున్నాయి. విండో తెరవడం ఇష్టం లేకపోతే.. విండో సీట్లో ఎందుకు కూర్చోవాలో అంటూ నెటిజన్లు యువతి తీరును తప్పుబడుతున్నారు. ఇంత చిన్న విషయానికే గొడవ పడతారా.. విండో డోర్ క్లోజ్ చేసి ఉంచితే సరిపోతుంది కదా.. ఈ గొడవ గురించి వింటే నవ్విపోదురుగాక! అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: Flight, VIRAL NEWS

ఉత్తమ కథలు