TikTok : ఆ అమ్మాయికి ఒంటి నిండా ఉల్లిగడ్డలే..

TikTok : ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలపై పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఉల్లి ధరలపై వింత వింత వీడియోలు పెడుతున్నారు.

news18-telugu
Updated: November 23, 2019, 8:11 PM IST
TikTok : ఆ అమ్మాయికి ఒంటి నిండా ఉల్లిగడ్డలే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాన్ని కోయకుండానే ధరలతోనే కన్నీళ్లు పెట్టిస్తోంది. ధరలు ఎప్పుడు దిగొస్తాయా? అని సామాన్య ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలపై పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బంగారం ధరల్ని సైతం మించిపోతున్నాయని.. ఇక బంగారం కొనడం ఆపేసి ఉల్లి గడ్డలను కొంటే సరి అని.. గిఫ్ట్‌గా ఉల్లిగడ్డలను ఇస్తే బెటర్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు ఇంకో అడుగు వేసి టిక్‌టాక్ ద్వారా తమ అసహనాన్ని వెల్లగక్కుతున్నారు. వింత వింత వీడియోలు పెడుతూ ఉల్లి ధరలపై స్పందిస్తున్నారు. తాజాగా.. ఓ యువతి ఒంటిపై నగలకు బదులు ఉల్లిగడ్డలను ఉంచుకొని టిక్‌టాక్ వీడియో చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

First published: November 23, 2019, 6:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading