Home /News /trending /

YOUNG GIRL LOVE MARRIAGE WITH BLIND PERSON GET APPRECIATIONS FROM ALL IN CHITTOOR DISTRICT HSN

గుడ్డివాడిని చేసుకుని ఏం సుఖపడతావన్న మాటల్నీ లెక్క చేయలేదు.. ప్రేమించిన వాడినే పెళ్లాడిన యువతి..

అశోక్ కుమార్, వీరమ్మ

అశోక్ కుమార్, వీరమ్మ

గుడ్డివాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావని కొందరు మాటలు అంటున్నా ఆ యువతి లెక్క చేయలేదు. ప్రేమించిన వాడినే కులాంతర వివాహం చేసుకుంది. పెద్దలను కూడా ఒప్పించింది.

    ప్రేమ గుడ్డిది.. ప్రేమకు కళ్లు లేవు.. అనే మాటలు ఎన్నో ఏళ్లుగా వింటున్నవే. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కూడా అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. ప్రేమించిన వ్యక్తికి ఎలాంటి లోపాలు ఉన్నా సరే, వారితో కలిసి జీవితాంతం కలిసి జీవించడానికి సిద్ధపడతారు అన్నదే ఈ మాటల ఉద్దేశం. కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గం, వైకల్యం వంటి ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే ప్రేమ వాటిని జయిస్తుంది. తాజాగా జరిగిన ఓ ఘటన కూడా అందుకు నిదర్శనంగా మారింది. ఓ యువతి ఓ అంథుడిని ప్రేమించింది. పెద్దలు, స్నేహితులు వద్దని సలహాలు ఇచ్చినా అతడినే మనువాడింది. కులాంతర వివాహం చేసుకుంది. జీవితాంతం అతడికి తోడుగా ఉండేందుకు సిద్ధమయింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన అశోక్ కుమార్ స్థానికంగా ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో టీచర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అంథుడయినా అన్నింటా ముందుండేవాడు. అతడి తెలివితేటలను చూసి అందరూ అచ్చెరువునొందేవాళ్లు. తొట్టంబేడు మండలంలోని ఎస్టీ వర్గానికి చెందిన వీరమ్మ అనే యువతి కూడా అదే కోచింగ్ సెంటర్లో టీచర్స్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ట్రైనింగ్ లో ఉండగానే అశోక్ ను చూసి వీరమ్మ మనసుపడింది. అతడి ప్రతిభను ఎన్నోసార్లు మెచ్చుకుంది. జీవితాంతం అతడితో కలిసి జీవించాలని ఆశపడింది. గుడ్డివాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావని కొందరు మాటలు అన్నా ఆమె పట్టించుకోలేదు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్ హాస్టల్లో ఘోరం.. నాన్నా.. నన్ను క్షమించు.. అన్నా.. నేను తప్పు చేయలేదురా అంటూ.. మెసేజ్ పెట్టి మరీ..

    ప్రేమిస్తున్నానీ, పెళ్లి చేసుకుందామని అశోక్ తో చెప్పింది. మొదట వద్దని చెప్పిన అశోక్, ఆ తర్వాత వీరమ్మ ప్రేమకు కరిగిపోయాడు. వాళ్లిద్దరి కులాలు వేరయినా ఇద్దరూ కలిసి పెద్దలను ఒప్పించారు. మొదట అమ్మాయి తరపు వాళ్లు ఒప్పుకోకున్నా, చివరకు వాళ్లిద్దరి పట్టుదలను చూసి ఒప్పుకున్నారు. నగరిలో బుధవారం సిరిడీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. అంథుడయినప్పటికీ పెద్దలను ఒప్పించి మరీ అతడిని పెళ్లి చేసుకోవడాన్ని చూసి అందరూ వీరమ్మను, ఆ జంటను ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు.
    ఇది కూడా చదవండి: ఏడాది క్రితం పెళ్లయిన కూతురిని ఇంటికి పిలిచి.. అందరం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామని చెప్పిన తండ్రి.. చివరకు..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor, Crime news, Crime story, CYBER CRIME, Telangana, Tirupati

    తదుపరి వార్తలు