YOU WILL BE PUNISHED AND JAILED IF FORGET YOUR WIFE BIRTHDAY AK
Wife Birthday: భార్య పుట్టినరోజు గుర్తులేదా.. అయితే జైలు శిక్ష ఖాయం.. ఎక్కడంటే..
ప్రతీకాత్మక చిత్రం
ప్రతి మనిషి జీవితంలో పుట్టినరోజులు ప్రత్యేకమైనవి. అందుకే ఆ రోజు సదరు వ్యక్తికి ప్రత్యేక అనుభూతిని కలిగించాలి. అందులోనూ సమోవాలో భార్య పుట్టినరోజును మరచిపోతే అది చట్టరీత్యా నేరం.
మీకు మీ భార్య పుట్టిన రోజు గుర్తుందా ? ఇప్పటితరం వాళ్లకు ఈ విషయం గుర్తుంటుందేమో కానీ.. మనకంటే కాస్త వెనకటి తరం వాళ్లు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. మన దేశంలో ఆ గుర్తు పెట్టుకోకపోవడం పెద్ద నేరమేమీ కాదు కానీ.. కొన్ని దేశాల్లో మాత్రం భార్య(Wife) పుట్టిన రోజు గుర్తు లేకపోవడం మాత్రం ఒక రకమైన నేరమే. వినడానికి ఇది కాస్త విచిత్రంగానే ఉన్నా.. ఇది నిజంగా నిజం పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలోని సమోవా ఇలాంటి చట్ట అమలులో ఉన్న ప్రాంతం. అక్కడ భార్య పుట్టినరోజును మర్చిపోవడం వలన మీరు న్యాయపరమైన(legal) చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. చూడటానికి సమోవా అనేది ఒక అందమైన ద్వీపం(Island) . అక్కడి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. కానీ భార్యలను పట్టించుకోని భర్తలకు మాత్రం అదొక నరకమే.
ప్రతి మనిషి జీవితంలో పుట్టినరోజులు ప్రత్యేకమైనవి. అందుకే ఆ రోజు సదరు వ్యక్తికి ప్రత్యేక అనుభూతిని కలిగించాలి. అందులోనూ సమోవాలో భార్య పుట్టినరోజును మరచిపోతే అది చట్టరీత్యా నేరం. సమోవాలో భర్త అనుకోకుండా తన భార్య పుట్టినరోజును మరచిపోతే... అతను శిక్షగా జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. సమోవా చట్టం ప్రకారం భర్త తన భార్య పుట్టినరోజును అనుకోకుండా మరచిపోతే.. అది నేరం కిందకు వస్తుంది.
దీనిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తే భర్తని తీసుకెళ్లి జైలులో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు భర్త తన తప్పును సరిదిద్దుకోవడానికి చట్టపరమైన ఏర్పాట్లు చేశారు. కాబట్టి దీనికి అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొంత ఇబ్బందిపడాల్సి వస్తుంది. మొదటి సారి తన భార్య పుట్టినరోజును మరచిపోతే కాస్త చూసీచూడనట్టు వ్యవహరిస్తారు. మరోసారి ఇదే తప్పు పునరావృతం చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తారు. ఒకవేళ భర్త మళ్లీ అదే తప్పు చేస్తే జైలు శిక్ష రూపంలో శిక్ష పడుతుంది.
ఇవేం చట్టాలు అని అనుకునే వాళ్లు.. ప్రపంచంలోని పలు దేశాల్లో అమలులో ఉన్న కొన్ని విచిత్రమైన చట్టాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉత్తర కొరియాలో నీలిరంగు జీన్స్‌తో ఇంటి నుండి బయటకు వెళ్లడం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. దేశంలో నిషేధించబడినందున తూర్పు ఆఫ్రికాలో జాగింగ్ చేయలేరు. సింగపూర్‌లో నమలడం నిషేధించబడింది. ఎందుకంటే ఇది మురికిని కలిగిస్తుంది, ఇక ఓక్లహోమాలో మీరు కుక్కతో చెడ్డగా మాట్లాడితే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.