హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : ఏంది నీ అవతారం? సినిమా హాలుకొచ్చినట్టు? : ఐఏఎస్ అధికారి దుస్తులపై హైకోర్టు జడ్జి గరంగరం

Viral Video : ఏంది నీ అవతారం? సినిమా హాలుకొచ్చినట్టు? : ఐఏఎస్ అధికారి దుస్తులపై హైకోర్టు జడ్జి గరంగరం

పాట్నా హైకోర్టులో దృశ్యం

పాట్నా హైకోర్టులో దృశ్యం

హైకోర్టు విచారణకు హాజరైన సీనియర్ ఐఏఎస్ అధికారి సరైన డ్రెస్ కోడ్ పాటించలేదంటూ జడ్జిగారు ఫైరయిపోయారు. తన పొరపాటేంటో అర్థంకాక సదరు అధికారి తలగోక్కుంటుండగానే తీవ్రపదజాలంతో జడ్జిగారు అల్లాడించారు. వివరాలివే..

కరోనా అనంతర కాలంలో పలు హైకోర్టుల విచారణలు లైవ్ వెబ్‌కాస్ట్ అవుతోన్న క్రమంలో న్యాయస్థానంలోపల చోటుచేసుకునే చిత్రవిచిత్ర, ఆసక్తికర దృశ్యాలు ఇటీవల వార్తలుగా మారుతున్నాయి. పాట్నాహైకోర్టు (Patna High Court)లో జరిగిన సంవాదం తాలూకు వీడియో ఒకటి తాజాగా వైరలైంది. ఓ కేసు నిమిత్తం హైకోర్టు విచారణకు హాజరైన సీనియర్ ఐఏఎస్ అధికారి సరైన డ్రెస్ కోడ్ పాటించలేదంటూ జడ్జిగారు (Judge Raps IAS Officer) ఫైరయిపోయారు. తన పొరపాటేంటో అర్థంకాక సదరు అధికారి తలగోక్కుంటుండగానే తీవ్రపదజాలంతో జడ్జిగారు అల్లాడించారు. వివరాలివే..

బీహార్ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆ రాష్ట్ర అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనంద్ కిషోర్‌కు పాట్నా హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. హైకోర్టు ఎదుట కాలర్ తెరిచిన (ఓపెన్ కాలర్) తెల్ల చొక్కాతో హాజరైనందుకు న్యాయమూర్తి ఆ అధికారిని రఫ్పాడించారు. ‘కోర్టులో ఎలాంటి డ్రెస్ కోడ్ పాటించాలో తెలియదా? ముస్సోరిలో ఐఏఎస్ ట్రైనింగ్ స్కూల్ కి వెళ్లలేదా? ఏంటిది? బీహార్ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులకు కోర్టుకు ఎలా హాజరు కావాలో తెలీదా? ఫార్మల్ డ్రెస్ అంటే కోటు ధరించాలి. కనీసం కాలర్ తెరవకూడదుగా..’అంటూ న్యాయమూర్తి మండిపడ్డారు.

CM Jagan | MP Raghurama : రఘురామతో పోరులో జగన్‌కు మళ్లీ పరాభవం -PM Modi సాక్షిగా మరో షాక్?


జడ్జి వ్యాఖ్యలకు బిత్తరపోయిన ఐఏఎస్ ఆనంద్ కిషోర్.. ఉక్కపోత వేసవిలో కోటు ధరించాలనే అధికారిక డ్రెస్ కోడ్ ఏదీ లేదని సవినయంగా మనవి చేసుకున్నా.. సదరు వివరణతో న్యాయమూర్తి మరింత ఆగ్రహించారు. ‘కోర్టుకు వచ్చినప్పుడు సరైన డ్రెస్ కోడ్ ఉండాలి. ఇదేమైనా సినిమా హాల్ అని మీరు అనుకుంటున్నారా?’ అని జడ్జి.. ఆ అధికారిని గద్దించారు. నిజానికి..

Unique Marriage : ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో ప్రేమ.. ఇద్దరు బిడ్డలు పుట్టాక ఒకే వేదికపై పెళ్లి!


మన దేశంలో ఐపీఎస్, ఇతర పోలీసులు, డిఫెన్స్ సిబ్బందికి ఉన్నట్లు ఐఏఎస్ అధికారులకు ప్రత్యేకమైన యూనిఫాం అంటూ లేనప్పటికీ, కోర్టులకు.. మరీ ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులకు హాజరైనప్పుడు ఫార్మల్ డ్రెస్సులో రావడం, సాధ్యమైనంతలో కోటు ధరించడం లేదంటే కాలర్ గుండీ పెట్టుకోవడం రాసుకోని రాజ్యాంగంలా అమలవుతున్నది. అధికారులేకాదు, కక్షిదారులు, న్యాయవాదులు సైతం కోర్టుల్లో తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. సరైన యూనిఫాం లేదా ఫార్మల్ డ్రెస్‌లో లేని కారణంగా అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులను కోర్టు మందలించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాగా,

Weight Loss : బరువు తగ్గితే భారీ నజరానా.. 15కేజీలకు రూ.15,000 కోట్లు.. త్వరగా ఇచ్చేయండి సార్..Sonia Gandhi : సోనియా గాంధీకి అస్వస్థత.. Covid ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక.. వైరస్ విజృంభణ


ఐఏఎస్ అధికారి దుస్తులపై బీహార్ హైకోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ కాగా, సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి వేడిలో జడ్జిగారు అవతలివాళ్ల దుస్తులపై దృష్టి సారిస్తున్నారని కొందరు విమర్శించగా, కోర్టు విచారణలో ఒక అధికారి ధరించే దుస్తులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా విలువైన సమయాన్ని వృథాచేశారంటూ ఇంకొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరేమో ఐఏఎస్ అధికారి సరైన ఫార్మల్స్ ధరించనందుకు తగిన శాస్తే జరిగిందని, ఆమాత్రం క్రమశిక్షణ పాటించకుంటే ఎలా? అని వాదిస్తున్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Bihar, High Court, Patna

ఉత్తమ కథలు