Home /News /trending /

YOU SPOT A WORD ON A NUMBER PLATE IT WILL DEFINITELY GRAB YOUR ATTENTION A DELHI BASED GIRL IS FACING A SIMILAR SITUATION SSR

Strange: పాపం ఈ అమ్మాయి.. కొత్త స్కూటీ కొనుక్కుని బయటకు వెళ్లలేని పరిస్థితి.. కారణం ‘SEX’

స్కూటీపై నంబర్ ప్లేట్

స్కూటీపై నంబర్ ప్లేట్

ఏ బైక్‌నైనా, కారునైనా చూడగానే మనకు టక్కున కనిపించేది నెంబర్ ప్లేట్. ఏపీలో అయితే.. ‘AP’ సిరీస్‌తో, తెలంగాణలో అయితే ‘TS’ సిరీస్‌తో వాహనాలపై నెంబర్ ప్లేట్ కనిపిస్తుంటుంది.

  ఢిల్లీ:బైక్‌నైనా, కారునైనా చూడగానే మనకు టక్కున కనిపించేది నెంబర్ ప్లేట్. ఏపీలో అయితే.. ‘AP’ సిరీస్‌తో, తెలంగాణలో అయితే ‘TS’ సిరీస్‌తో వాహనాలపై నెంబర్ ప్లేట్ కనిపిస్తుంటుంది. నంబర్ ప్లేట్‌పై ‘AP31 BP 1497’ ఆ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను, ఆ వాహనం ఏ రాష్ట్రానికి, ఏ జిల్లాకు చెందినదో సూచిస్తూ.. ఇలా అంకెలు, ఆంగ్లంలో అక్షరాలు ఉంటుంటాయి. అయితే.. ఇలా నెంబర్ ప్లేట్‌పై ఉన్న ఆంగ్ల అక్షరాలు ఢిల్లీలో ఓ యువతికి ఊహించని చిక్కులు తెచ్చిపెట్టాయి. ఆమె నెంబర్ ప్లేట్‌పై ఉన్న ఆంగ్ల అక్షరాలు ‘SEX’ అని ఉండటమే అందుకు కారణం. స్కూటీ నెంబర్ ప్లేట్‌పై ‘SEX’ అని ఉండటంతో ఆమె ఆ వాహనంపై బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి.

  ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్‌కు ఈ సమస్య ఎదురైంది. ఆ యువతి రోజూ ఢిల్లీ మెట్రోలో జనక్‌పురి నుంచి నోయిడాకు ప్రయాణం చేస్తుండేది. గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుండటంతో ఆ పాట్లు పడలేక తన తండ్రిని స్కూటీ కొనమని కోరింది. ఆమె బతిమలాడుకోగా ఎట్టకేలకు సంవత్సరం తర్వాత ఆమెకు తండ్రి స్కూటీ కొనిచ్చారు. ఈ దీపావళి కానుకగా కూతురికి ఆ తండ్రి స్కూటీ కొనిచ్చాడు. దీంతో.. ఆ యువతి ఎంతో సంతోషపడింది. హ్యాపీగా రోజూ స్కూటీపై వెళ్లి రావచ్చని ఆశ పడింది. కొన్ని రోజులకు ఆమె స్కూటీకి సీక్వెన్స్ ప్రకారం నెంబర్ ప్లేట్ వచ్చింది. ఆ నెంబర్ ప్లేట్‌ చూసి ఆ యువతి ఒక్కసారిగా షాకైంది. ఆ నంబర్ ప్లేట్‌ ‘DL3 SEX’ అనే సీక్వెన్స్‌తో రావడమే ఇందుకు కారణం.

  ఇది కూడా చదవండి: Viral: ముసలోడే కానీ మహా రసికుడు.. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదేనేమో..

  ఆ స్కూటీని తాను నడుపుతుంటే.. అలా ‘SEX’ అని నంబర్ ప్లేట్‌పై ఉంటే తన ఇరుగుపొరుగున ఉంటున్న ఆంటీలు ‘సిగ్గు లేకుండా ఆ స్కూటీపై తిరుగుతోంది’ అంటూ తనను ఎగతాళి చేస్తున్నారని.. తన చుట్టూ ఉన్న వారంతా తనను తప్పుబడుతున్నారని బాధిత యువతి పేర్కొంది. ఆ యువతి మాత్రమే కాదు.. ఆమె తండ్రికి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కావడంతో తమకు కేటాయించిన నంబర్ మార్చాలని కోరగా వాళ్లు ఊహించని సమాధానం వచ్చింది. ఢిల్లీలో ‘SEX’ సీక్వెన్స్‌తో చాలా కార్లు, స్కూటీలకు ఇలాంటి నంబర్ వచ్చిందని.. ఎవరికీ లేని సమస్య మీకేంటని.. మీ కూతురేమీ ఈ ప్రపంచంలో రాణి గారు కాదు ఆమెకు ప్రత్యేకంగా వేరే నంబర్ కేటాయించడానికి’ అని బదులివ్వడంతో అవాక్కవడం ఆ తండ్రీకూతురి వంతైంది. ఇక.. ఈ సమస్య లోతుపాతుల్లోకి వెళితే.. మనం ఒక కొత్త వాహనం కొంటే స్థానిక ఆర్టీవో ఆఫీస్‌లో రిజిస్ట్రర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయించడం జరుగుతుంది. ఆల్ఫాబెట్, సంఖ్యలతో కూడిన నంబర్ మనకు కేటాయించిన నంబర్ ప్లేట్‌పై ఉంటుంది.

  ఇది కూడా చదవండి: Viral: ఇదేదో రికార్డింగ్ డ్యాన్స్‌లో సీన్ కాదు.. వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఉంది ఎవరో తెలిస్తే..

  ఢిల్లీలో ప్రస్తుతం కొన్ని వాహనాలకు ‘E’, ‘X’ ఆల్ఫాబెట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయిస్తున్నారు. టూవీలర్స్‌కు అయితే ఈ ‘EX’ ముందు ‘S’ చేరుతుంది. అందువల్ల.. కొత్తగా స్కూటీ కొన్న ఈ యువతికి ఆర్టీవో కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ ‘SEX’తో ఉండి సమస్యగా మారింది. ఈ యువతి తండ్రి నంబర్‌ను మార్చాలని డీలర్‌ను సంప్రదించగా.. సరై కాలే ఖాన్ ఆర్టీవో ఈ నంబర్‌ను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయడం జరిగిందని.. నంబర్‌ను మార్చడం కుదరదని తేల్చి చెప్పేశారు. దాదాపు సంవత్సరం పాటు తండ్రితో పోట్లాడి, అలిగి ఎట్టకేలకు కాలేజ్‌కు వెళ్లేందుకు స్కూటీ కొనుక్కుంటే ఇంట్లోనే ఉంచి తాళం వేసుకోవాల్సిన పరిస్థితి ఈ యువతికి ఎదురైంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కూడా ఆ నంబర్‌ను మార్చలేమని తేల్చి చెప్పేశారు. ఒక వాహనానికి కేటాయించిన నంబర్‌ను మార్చేందుకు ఎలాంటి వెసులుబాటు లేదని.. రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ చేస్తున్నప్పుడు ఒక ప్యాట్రన్ అనుసరించి నంబర్‌ను కేటాయించడం జరుగుతుందని.. ఆ ప్యాట్రన్ ప్రకారమే ఆ యువతి స్కూటీకి నెంబర్‌ను కేటాయించారని స్పష్టం చేశారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Delhi, Fancy numbers, SCOOTER, Sex, Trending, VIRAL NEWS

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు