ఈ కోతి ఫొటోకు మంచి క్యాప్షన్ ఇస్తే.. మహింద్రా కారు గిఫ్ట్.. మీరూ ట్రై చేయండి

క్యాప్షన్ కాంపిటీషన్‌లో గెలిస్తే నిజంగానే మహింద్రా కారు ఇస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆనంద్ మహింద్రా తన ట్వీట్‌లోనే క్లారిటీ ఇచ్చారు.

news18-telugu
Updated: October 10, 2020, 5:06 PM IST
ఈ కోతి ఫొటోకు మంచి క్యాప్షన్ ఇస్తే.. మహింద్రా కారు గిఫ్ట్.. మీరూ ట్రై చేయండి
(Image:Twitter)
  • Share this:
ఇంటిపై డీటీహెచ్ యాంటెన్నా.. దానిపై తాపీగా కూర్చొని రోడ్డు వైపు చూస్తున్న కోతి. ఇదీ ఫొటో..! దీనికి మంచి క్యాప్షన్ ఇస్తే మీరు మహింద్రా కారును గెలవచ్చు. ఈ ఆఫర్ ఎవరిచ్చారో తెలుసా..? మహింద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్రా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బిజినెస్ మ్యాన్.. డీటీహెచ్ యాంటెన్నాపై కూర్చున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు మంచి కాప్షన్ ఇవ్వాలని.. హిందీ, ఇంగ్లీష్ కేటగిరీల్లో రెండు గిఫ్ట్‌లు ఉంటాయని తెలిపారు. అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చిన వారికి మహింద్రా కారు స్కేల్ మోడల్‌ను బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు. అక్టోబరు 11 మధ్యాహ్నం 2 గంటల లోపు తమ క్యాప్షన్‌ను పంపించాలని ట్వీట్ చేశారు ఆనంద్ మహింద్రా.


ఆ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు.. పెద్ద ఎత్తున ట్వీట్ల మోత మోగిస్తున్నారు. తమ మెదడుకు పనిపెట్టి చిత్ర విచిత్ర క్యాప్షన్స్ ఇస్తున్నారు. వాటిలో కొన్నింటినీ ఇక్కడ చూడండి.


వీటిలో కొన్నింటిని చూసిన ఆనంద్ మహింద్రా.. నిజంగా చాలా మంచి క్యాప్షన్స్ వస్తున్నాయని ట్వీట్ చేశారు. 'సిట్ టాప్ బాక్స్' అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను హైలైట్ చేశారు.


మరి ఈ క్యాప్షన్ కాంపిటీషన్‌లో గెలిస్తే నిజంగానే మహింద్రా కారు ఇస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆనంద్ మహింద్రా తన ట్వీట్‌లోనే క్లారిటీ ఇచ్చారు. 'స్కేల్ మాడల్ ఆఫ్ మహింద్రా వెహికల్స్' అని.. ! స్కేల్ మాడల్ అంటే నిజమైన వాహనం కాదు. కేవలం టాయ్ కారు మాత్రమే..! అంటే ఇందులో గెలిచిన వారు లక్షలు విలువ చేసే అసలైన కారు కాదు.. కేవలం వేలు విలువ చేసే టాయ్ కారును గెలుచుకోవచ్చు. ఏదో ఒకటిలే ఫ్రీగా వస్తుంది కదా.. అని చాలా మంది ట్వీట్స్ చేస్తున్నారు. మరి మీరూ కూడా ట్రై చేయండి.
Published by: Shiva Kumar Addula
First published: October 10, 2020, 5:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading