YOU CAN BUY HAPPINESS WITH MONEY THE NEW SCIENTIFIC STUDY REVEALS SHOCKING FACTS MS GH
Money: సంపదతో సంతోషాన్నీ కొనేయచ్చు.. ఎంత డబ్బుంటే అంత సంతోషం.. ఇది కొత్త లెక్క..
ప్రతీకాత్మక చిత్రం
Money: అమ్మకానికి అన్నీ రెడీగా ఉన్న ఈ ఆధునిక యుగంలో డబ్బుతోనే ఆనందమైనా, సంతోషమైనా అని సామాన్యులంతా బల్లగుద్ది వాదిస్తారు. ఇదే విషయాన్ని సాంకేతికంగా రుజువు ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు కానీ.. ఓ తాజా స్టడీ ఇదే విషయాన్ని కుండబద్ధలు కొట్టింది.
"ఎవరన్నారు డబ్బు సంతోషాన్నివ్వలేదని...?’ అంటోంది నేటి కాలం. "డబ్బుతో సంతోషాన్ని కొనుక్కోలేం".. అన్న పాత నానుడికి కాలం చెల్లింది.. డబ్బుతో సర్వం సాధ్యం.. ముఖ్యంగా వెలకట్టలేని సంతోషాన్ని, ఆనందాన్ని మనం సొంతం చేసుకోవాలంటే కాసులు చెల్లిస్తే సరి. అమ్మకానికి అన్నీ రెడీగా ఉన్న ఈ ఆధునిక యుగంలో డబ్బుతోనే ఆనందమైనా, సంతోషమైనా అని సామాన్యులంతా బల్లగుద్ది వాదిస్తారు. ఇదే విషయాన్ని సాంకేతికంగా రుజువు ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు కానీ.. ఓ తాజా స్టడీ ఇదే విషయాన్ని కుండబద్ధలు కొట్టింది. "సంతోషమే సగం బలం".. అన్న నానుడి మాత్రం అక్షరసత్యం, ఎందుకంటే మన సంతోషాన్ని మనం కొనగలం కనుక అది మనకిచ్చే బలం అనిర్వచనీయం.
సంతృప్తిగా మనం బ్రతకాలంటే మనం కోరుకున్నవన్నీ మనకు దక్కాలని సగటు మనిషి ఆశపడతాడు. మరి కోర్కెలు తీరాలంటే మూల మంత్రం మాత్రం ధనమేగా. 2010లో నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్త ఒకరు చెప్పినదాని ప్రకారం.. మనకు రూ. 54 లక్షల తరువాత వచ్చే కొత్త ఆనందం ఏముండదని, డబ్బుతో ఆనందం రాదని చెప్పటం సరైనది కాదంటూ పెన్సిల్వేనియా యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తేలటం విశేషం.
కూడేకొద్దీ ఆనందమే..
డబ్బు కూడేకొద్దీ మీకు ఆనందం పెరుగుతుందని, ఇది చెప్పలేనంత ఆనందాన్నిస్తుందని వీరి స్టడీలో తేలటం ఆశ్చర్యకరం అనుకుంటున్నారా. ఈ స్టడీ సాంకేతికంగా, శాస్త్రీయంగా చేసినదే కాబట్టి దాని లోతుపాతులు తెలిస్తే మీరు కూడా విషయాన్ని విశ్వసిస్తారు. 1,725,994 మంది నుంచి సేకరించిన శ్యాంపుల్స్ లో.. డబ్బుతో హ్యాపీనెస్ ను కొనచ్చని తేలింది. అందుకే జీతభత్యాలు ఎక్కువగా వస్తున్న ఎగువతరగతి ప్రజలు కాస్త ఎక్కువగా సంతోషంగా ఉంటారని ఇప్పటికైనా మీరు నమ్ముతారు కదా.
రియల్ టైం రిపోర్ట్..
33,391మంది నుంచి స్మార్ట్ ఫోన్ పై రియల్ టైంలో రిపోర్ట్ సేకరించగా వారు కూడా డబ్బుతో సంతోషంగా ఉండచ్చనే విషయాన్ని వెల్లడించారు. కాబట్టి పాత సిద్ధాంతాలకు కాలం చెల్లిందని ప్రయోగాత్మకంగా రుజువైంది. అంతెందుకు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే సమాధానం ఏంటి..ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు ఇంత డబ్బు మూటకట్టాక అదనంగా మీరు సంపాదించే డబ్బుతో ఎటువంటి ఆనందం దొరకదనేది నిజం కాదని తేలింది. అందుకే ఆదాయం పెరిగేకొద్దీ ఆనందం పెరుగుతుంది.
ఎక్కువ ఆప్షన్స్..
మీ వద్ద ఎక్కువ డబ్బు ఉంటే మీకు ఎక్కువ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నట్టే. బోలెడంత డబ్బు చేతిలో ఉంటే మీకు స్వాతంత్రం ఉన్నట్టే లెక్క. ఇక చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా నిర్ణయాలు తీసుకునేందుకు ఎక్కువ ఆప్షన్స్ కల్పించేది డబ్బు మాత్రమే. ఎక్కువ ఆప్షన్స్ ఉంటే చాలామంది సంతోషిస్తారు. కాబట్టి సంతోషాన్ని కలిగించే డబ్బుకు ప్రత్యామ్నాయం లేదు. ఒకటి మాత్రం నిజం ..ఇది అందరికీ వర్తించాలని లేదు. ఎందుకంటే కొందరు డబ్బుకు అతీతంగా ఆనందంగా, సంతోషంగా ఉంటారు. వారికి డబ్బుతో వచ్చే మార్పు ఏమీ ఉండదు. అదంతా ఆయా వ్యక్తుల మైండ్ సెట్ పై ఆధారపడి ఉంటుంది. కానీ కామన్ మ్యాన్ మాత్రం డబ్బుతో అన్నిరకాలు వసతులు, లగ్జరీలు కొని, ఎంజాయ్ చేసి సంతోషపడవచ్చని భావిస్తాడు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.