Home /News /trending /

YOU ARE A BOMBER GIRLFRIENDS MESSAGE TO MAN DELAYS MANGALURU MUMBAI FLIGHT BY 6 HOURS PAH

కొంప ముంచిన యువతి ఛాటింగ్.. 6 గంటల పాటు విమానంలో హల్ చల్.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka: యువతి తన ప్రియుడితో ఛాటింగ్ చేస్తోంది. క్యాబిన్ లో ఉన్న కూడా గంటల తరబడి మెసెజ్ లు చేసుకుంటున్నారు. ఇంతలో అదే క్యాబిన్ లో పక్కసీటులో ఉన్న ఒక మహిళ వాళ్లు చేసుకుంటున్న ఛాటింగ్ ను చూసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India
ప్రేమలో ఉన్నవారు పక్కవారిని అసలు పట్టించుకోరు. చుట్టు పక్కల ఉన్నవారితో సంబంధం లేనట్లు ప్రవర్తిస్తుంటారు. అదోక ఊహా ప్రపంచంలో ఉన్నట్లు ఉంటారు. ఒక్కనిముషం కూడా ఒకరిని వదిలి మరోకరు ఉండరు. ఎక్కడికి వెళ్లిన మెసెజ్ లు, కాల్స్ లు ఉండనే ఉంటాయి. వీడియో కాల్స్, వాట్సప్ కాల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొరపాటున.. దూరంగా ఎక్కడికైన వెళ్లాల్సి వస్తే.. ఇక ఫోన్ లోనే తలను దూరుస్తుంటారు. పక్కన ప్రపంచం మునిగిపోయిన.. ఎవరూ ఎక్కడికి వెళ్లిన అసలు పట్టించుకోరు. ఈ క్రమంలో కొన్ని అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో (Karnataka) షాకింగ్ ఘటన జరిగింది. ఒక మహిళ అత్యుత్సాహాంతో , మంగళూరు-ముంబై విమానం దాదాపు 6 గంటలపాటు ఆలస్యంగా బయలు దేరింది. అయితే.. క్యాబిన్లో కూర్చన ఒక మహిళ.. ఆమె పక్కన ఒక యువతి ఫోన్ లో తెగచాటింగ్ చేయడం చూసింది. అసలు. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మెసెజ్ లు పెడుతుంది. దీంతో మహిళ ఒక కన్నును.. యువతి ఫోన్ పైన పడేసింది.

యువతి ఫోన్ లోనే మునిగిపోయింది. పక్కన ఎవరైన తనను గమనిస్తున్నారా.. అన్న విషయం కూడా మరిచిపోయింది. అప్పుడు యువతి.. తన లవర్ కు నువ్వు బాంబర్ వి అంటూ ఒక మెసెజ్ పంపింది. అది చూసిన మహిళకు ఊపిరి ఆగినంతా పనైంది. వెంటనే ఫ్లైట్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో అధికారులు వెంటనే విచారణ చేపట్టారు. వెంటనే ఇండిగో ఫ్లైట్ అధికారులు ప్రయాణికులను కిందకు దింపేశారు. అక్కడున్న లగేజీని మరోసారి పరిశీలించారు.

సామానును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత 185 మంది ప్రయాణికులను ముంబైకి వెళ్లే విమానంలో మళ్లీ ఎక్కించారు. విమానం సాయంత్రం 5 గంటలకు బయలుదేరింది. అయితే భద్రత విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహపూర్వక సంభాషణ జరిగినందున అర్థరాత్రి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని నగర పోలీసు కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Karnataka, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు