ప్రభుత్వాలు బీపీఎల్ కు దిగువన ఉన్న చిన్నారులకు మంచి సరైన పోషక పదార్థాలతో కూడిన మెనుతో మధ్యాహ్న భోజనం పెడుతుంటారు. అనేక చోట్ల పాఠశాలలో సరైన ఆహార పదార్థాలను మెనుకు తగ్గట్టుగా అందిస్తుంటాయి. అయితే.. కొన్ని చోట్ల మాత్రం.. ఆయా హస్టల్ లు, పాఠశాలను నిర్వహించే సిబ్బంది ప్రభుత్వం అందించే, సామాగ్రిని పక్కదారిన బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుంటారు. ప్రభుత్వం సూచించిన మెనును అసలు పాటించరు. దీనికి బదులుగా క్వాలిటీలేని ఆహారం అందిస్తుంటారు. ఇలాంటి ఎన్నో ఘటనలు తరచుగా వార్తలలో ఉంటునే ఉంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా (Viral video) మారింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh) అయోధ్య పాఠశాలలో జరిగిన ఘటన వార్తలలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు మధ్యాహ్న భోజనం పెట్టారు. దానిలో ప్రభుత్వం ఇచ్చే మెను కాకుండా కేవలం అన్నం, ఉప్పు మాత్రమే ఇచ్చారు. చిన్నారులు కూడా అదే తింటున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో (Socia media) వైరల్ చేశారు. దీనిపై యోగి బాబా.(Yogi adityanath) .. ఇదే నా మీ పాలన అంటూ కామెంట్ లు చేశారు. ప్రస్తుతం దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఇప్పటికే పాఠశాల ప్రిన్స్ పల్ ను సస్పెండ్ చేశారు . విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
A video of children at a primary school in UP's Ayodhya being served boiled rice and salt as mid day meal has surfaced. pic.twitter.com/5wVaE9XWKC
— Piyush Rai (@Benarasiyaa) September 28, 2022
అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ మాట్లాడుతూ, “ఈ సంఘటన మంగళవారం జరిగింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. “బేసిక్ శిక్షా అధికారి (BSA) విచారణను నిర్వహిస్తుంది. ప్రిన్సిపాల్‌ని కూడా సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులను బస్తాల మీద కూర్చోబెడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థులకు నిర్ణీత మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందడం లేదని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తరచూ గైర్హాజరవుతున్నారని ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, Viral Video, Yogi adityanath