YELLOW TORTOISE RARE YELLOW TURTLE CAUGHT IN WEST BENGALS EAST MIDNAPORE SK
Yellow Turtle: పసుపు పచ్చ తాబేలు.. ఇలాంటి తాబేలుని ఎక్కడా చూసి ఉండరు..
పసుపు రంగు తాబేలు
ఇలాంటి పసుపు రంగు తాబేలు అరుదైనవే అయినా.. ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా లభ్యమయ్యాయి. గత ఏడాది జులై ఒడిశాలోని బాలాసోర్‌లో ఇచ్చం ఇలాంటి తాబేలే మత్స్యకారుడి వలకు చిక్కింది.
సాధారణంగా తాబేళ్లు బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఆలిన్ గ్రీన్, గ్రీనిష్ బ్రౌన్, రెడిష్ బ్రౌన్ రంగుల్లోనూ కనిపిస్తుంటాయి. ఐతే పశ్చిమ బెంగాల్లో ఓ మత్స్యకారుడికి మాత్రం పసుపు రంగు తాబేలు దొరికింది. ఇలాంటి తాబేళ్లు చాలా అరుదుగా ఉంటాయి. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఖెజూరి గ్రామంలో ఈ అరుదైన తాబేలు కనిపించింది. సుబిమాల్ బేరా అనే మత్స్యకారుడు ఎప్పటిలాగే సముద్రంలో వేటకు వెళ్లాడు. అతడి వలకుపసుపు రంగులో ఉన్న తాబేలు చిక్కడంతో ఆశ్చర్యపోయాడు. అతడికి ఎప్పుడూ ఇలాంటి తాబేలు దొరకలేదు. స్థానికులు, ఇతర మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం అటవీశాఖ అధికారుల వరకు వెళ్లడంతో వారు ఖెజూరి గ్రామానికి వెళ్లి ఆ అరుదైన తాబేలును స్వాధీనం చేసుకున్నారు. దాని ప్రభుత్వ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఇలాంటి పసుపు రంగు తాబేలు అరుదైనవే అయినా.. ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా లభ్యమయ్యాయి. గత ఏడాది జులై ఒడిశాలోని బాలాసోర్‌లో ఇచ్చం ఇలాంటి తాబేలే మత్స్యకారుడి వలకు చిక్కింది. బీచ్‌లో తిరుగుతుండగా స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబరులో పశ్చిమ బెంగాల్ మరో తాబేలు కనిపించింది. బర్ద్వాన్ జిల్లాలో దొరికిన తాబేలును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని గురించి దేబాశీష్ శర్మ అనే ఫారెస్ట్ అధికారి ట్విటర్లో పోస్ట్ చేశారు. జన్యుపరమైన లోపాలు లేదా టైరోసిన్ పిగ్మెంట్ లేకపోవడం వల్ల కొన్ని తాబేళ్లు పసుపు రంగులోకి మారుతాయని ఆయన చెప్పారు. ఆ తాబేలను తిరిగి సముద్రంలోకే ఆయన వదలిపెట్టారు.
ఇప్పుడు కూడా అలాంటి తాబేలే బెంగాల్లో కనిపించడంతో దానిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. భలే చూడ ముచ్చటగా ఉందని సంబరపడ్డారు. మళ్లీ ఇలాంటిది కనిపిస్తుందో లేదో అని చాలా మంది సెల్ఫీలు తీసుకున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.