Yellow Brick Path Found At Bottom Of Pacific Ocean : భూమి మీద ఉన్న మహాసముద్రాలలో పసిఫిక్ మహాసముద్రం అతి పెద్దది అన్న విషయం తెలిసిందే. పోర్చుగీసు నావికుడు ఫెర్డినాండ్ మాగెల్లాన్ లాటిన్ భాషలో ఈ మహాసముద్రానికి "మార్ పసిఫికమ్(Mare Pacificum) అనే పేరు సూచించాడు. అంటే "ప్రశాంతమైన సముద్రం" అని అర్థం. చరిత్రపూర్వ కాలం నుండి ఆసియా, ఓషియానియా ప్రజలు పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణించారు. స్పానిష్ అన్వేషకుడు వాస్కో నీజ్ డి బాల్బోవా 1513 లో పనామా ఇస్తమస్‌ను దాటి దక్షిణ పసిఫిక్ సముద్రాన్ని చూసి దానికి ఆయన " మార్ డెల్ సుర్ " (స్పానిష్ భాషలో) అని పేరు పెట్టాడు. 1521 లో స్పానిషు నావికులు ప్రపంచ ప్రదక్షిణ చేసిన సమయంలో బృందంలోని పోర్చుగీసు అన్వేషకుడు ఫెర్డినాండ్ మాగెల్లాన్ ఈ మహాసముద్రానికి ప్రస్తుత పేరును ఉపయోగించాడు. ఆయన సముద్రం చేరుకోవడానికి అనుకూలమైన గాలులను ఎదుర్కొన్నందున ఈ మహాసముద్రానికి ఆయన " మార్ పాసిఫికో " పేరు పెట్టాడు.
అయితే ఈ ఫసిఫిక్ మహా సముద్రం (Pacific Ocean)లోపల సైంటిస్టులు ఓ దారిని చూశారు. అది పసుపు రంగు ఇటుకలతో (yellow brick)నిర్మించినట్లు ఉంది. హవాయ్ దీవులకు ఉత్తరాన సముద్ర గర్భంలో పరిశోధిస్తుండగా ఈ రోడ్డు కనిపించింది. ఈ రోడ్డు ఉన్న ప్రాంతాన్ని లిలిఓకలానీ రిడ్జ్ సీమౌంట్స్ అంటారు. సీమౌంట్ ట్రయల్ లో ఉన్న పగులును పరిశీలించేందుకు సైంటిస్టులు సముద్ర గర్భంలోకి వెళ్లారు. నాటిలస్ అనే వాహనంలో సముద్రగర్భంలో వెళ్లగా అక్కడ పసుపు రంగు ఇటుకలతో నిర్మించిన ఓ దారి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ నిర్మాణం శంకుస్థాపన చేసిన రహదారిని పోలి ఉంది. రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే మరో వాహనాన్ని ఉపయోగించి ఈ పసుపు ఇటుకలను పరిశీలించారు. దీంతో వాళ్లకో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఈ రోడ్డు ఉన్న ప్రదేశంలో ఓ పురాతన సరస్సు ఉండేదనీ... అది ఎండిపోయిందని తెలుసుకున్నారు. సరస్సు ఎండిపోయినప్పుడు ఈ పసుపు రంగు రాళ్ల రోడ్డు ఏర్పడింది. ఈ పసుపు రంగు రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం... ప్రాచీనకాలంలో భూమిలో జరిగిన అగ్నిపర్వతాల పేలుళ్లే అని అంటున్నారు. వేడి, చల్లదనాల వల్ల పసుపు రంగు రాళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయని అంటున్నారు.
దీనికి సంబంధించిన వీడియోని శాస్త్రవేత్తల టీమ్ EVNautilus అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ ఇటుక రాళ్లను చూస్తే... మనిషి తయారుచేసిన వాటిలాగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ ఇటుక మార్గాన్ని "అట్లాంటిస్‌కు రహదారి" అని ఓ సైంటిస్టు వర్ణించగా..మరొకరు ఇది నిజంగా విచిత్రం అని మాట్లాడుతున్నట్లు ఆ వీడియో క్లొప్ లలో కనిపిస్తోంది.
https://youtu.be/TID2kc8yb9Q
అట్లాంటిస్ అనేది ఓ అద్భుత నగరం. ఇప్పటివరకూ ఈ అట్లాంటిస్ అనే నగర దీవి ఊహల్లోనే ఉంది. అయితే తాజాగా బయటపడిన దారి అట్లాంటిస్ మార్గమేనని సైంటిస్టులు భావిస్తున్నారు. తమ బృందం మునుపెన్నడూ ఈ ప్రాంతాన్ని సర్వే చేయలేదని, కానీ ఇప్పుడు పురాతన సముద్రపు పర్వతాల రాతి వాలులలో మరియు లోపల జీవితాన్ని లోతుగా పరిశీలిస్తామని సైంటిస్టులు పేర్కొన్నారుbricks
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pacific Ocean, Scientists, Viral