Year End 2019 : ఈ ఏడాది ఇంటర్నెట్‌లో ఆకర్షించిన అంశాలు

Year End 2019 : ఇంటర్నెట్ ఓ మహా ప్రపంచం. అందులో ఎన్నో విశేషాలున్నా... కొన్ని మాత్రం చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఏడాది అలాంటి టాప్ 10 అంశాల్ని తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 20, 2019, 11:03 AM IST
Year End 2019 : ఈ ఏడాది ఇంటర్నెట్‌లో ఆకర్షించిన అంశాలు
Year End 2019 : ఈ ఏడాది ఇంటర్నెట్‌లో ఆకర్షించిన అంశాలు
  • Share this:
2019 జనవరి 4న వరల్డ్ రికార్డ్ కోసం అంటూ ఇన్‌స్టాగ్రాంలో ఓ ఎగ్ ఫొటోతో అకౌంట్ క్రియేటైంది. అందరూ దాన్ని లైక్ చెయ్యాలని కోరారు. నెటిజన్లు కూడా అందుకు తగ్గట్టే స్పందించారు. లైక్స్, షేర్స్ చేసారు. నిజంగానే అది వరల్డ్ రికార్డ్ సృష్టించింది. సోషల్ మీడియా సెన్సేషన్ మోడల్ కైలీ జెన్నర్ (1.8 లక్షల లైక్స్) కంటే ఎక్కువ లైక్స్ ఆ ఎగ్‌ అకౌంట్‌కి వచ్చాయి. ప్రస్తుతం ఆ అకౌంట్‌కి 5.4 కోట్ల లైక్స్ ఉన్నాయి. మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ కోసం ఈ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ప్రతి ఒక్కరూ గుడ్డు తినాలనే ప్రచారానికి ఇది మరింత అవగాహన పెంచుతూ... ఎక్కువ మంది ఎగ్స్ లైక్ చేసేలా చేసింది. అందువల్ల 2019లో ఇదో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా చెబుతున్నారు. 

View this post on Instagram
 

Let’s set a world record together and get the most liked post on Instagram. Beating the current world record held by Kylie Jenner (18 million)! We got this ? #LikeTheEgg #EggSoldiers #EggGang


A post shared by EGG GANG ? (@world_record_egg) on

2016లో తయారైన వైట్ క్లా‌ సమ్మర్ డ్రింక్‌కి 2019లో మంచి క్రేజ్ వచ్చింది. ఒక్కసారిగా వీడియోలు, కాంటెస్ట్‌లు, టీషర్ట్‌లు, హాలోవీన్ కాస్ట్యూమ్స్ అన్నీ దాన్ని యాడ్ చేశాయి. ఫలితంగా 2019లో వైట్ క్లా పై పెద్ద చర్చే జరిగింది. తక్కువ ఆల్కహాల్, తక్కువ కేలరీలు ఉండటంతో... దీన్ని ఎక్కువ మంది ఇష్టపడ్డారు.2019లో మెగాన్ థీ స్టాల్లియన్... ఫీవర్ ఆల్బం రిలీజ్ చేసింది. అది హాట్ గర్ల్ సమ్మర్‌గా దుమ్మురేపింది. గాళ్స్, గైస్, ప్లేలిస్ట్స్, టీవీ షోస్, సెలబ్రిటీస్, బ్రాండ్స్ అంతటా హాట్ గర్ల్ సమ్మర్ కుమ్మేసింది. 
View this post on Instagram
 

I am loving these edits ??? HOTGIRL SUMMER IS ALMOST HEREEEE @nickiminaj @tydollasign


A post shared by Hot Girl Meg (@theestallion) on

రాంగ్ ఆన్సర్... ఇదో సోషల్ గేమ్. ఇందులో ఓ పిక్చర్ పోస్ట్ చేసి... అదేంటో అడగాలి. తప్పు ఆన్సర్ మాత్రమే చెప్పమనాలి. అది సినిమా పోస్ట్ కావచ్చు, వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు. ఈ ఏడాది ఈ గేమ్ దుమ్మురేపింది.


బాటిల్ క్యాప్ ఛాలెంజ్. ఇది కూడా ఈ ఏడాది బాగా డిబేట్ అయ్యింది. జూన్‌లో మొదలై ప్రపంచమంతా పాకేసింది. కోట్ల మంది ఇందులో పాల్గొని గిర్రును తిరుగుతూ కాలితో బాటిల్ మూతను తీశారు.ఫేస్ యాప్. ఇది కూడా ఈ సంవత్సరం అందర్నీ ఆలోచనలో పడేసిన యాప్. మొదట ఈ యాప్ అందరికీ నచ్చింది. ఆ తర్వాత చాలా మందికి అమ్మో ముసలివాళ్లం అయ్యాక అలా అయిపోతామా అని భయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.


2019 ఆస్కార్స్ వేడుకలో... లేడీ గాగా, బ్రాడ్లీ కూపర్ కలిసి... లవ్వీ డవ్వీ "షల్లో" పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ అఫీషియల్ వీడియో 24 కోట్ల వ్యూస్‌తో ఈ ఏడాది చెప్పుకోవాల్సిన మేటర్‌గా మారింది.


స్లైస్‌ని చిన్నారుల ముఖంపై విసరడం అన్నది మరో సెన్సేషన్. మొదట్లో ఇది అందరికీ నచ్చింది. కానీ రాన్రానూ ప్రజలు... పిల్లలపైనే కాదు... పెద్దవాళ్లపై, కుక్కలు, పిల్లులపై కూడా ఇలా స్లైస్‌లు, కేక్‌లతో కొట్టడంతో... మొదట్లో... బెస్ట్ అనుకున్నది కాస్తా చివర్లో నెగెటివ్ గేమ్ అయిపోయింది. చివరకు మొదట ఈ గేమ్ స్టార్ట్ చేసిన వ్యక్తి... క్షమాపణలు చెప్పుకున్నాడు.


బిగ్ లిటిల్ లైస్... సీజన్ 2 ప్రీమియర్‌లో మెరిల్ స్ట్రీప్... ఉన్నట్టుండి పెద్దగా అరుస్తూ పాడటం ఈ ఏడాది మరో సెన్సేషన్. దీనిపై ఎన్నో మెమేస్ వచ్చాయి. ఆమె అరుపుకి ఎమ్మీ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదని కామెంట్లు చేశారు.


కాట్స్ మూవీ కూడా ఈ సంవత్సరం అందర్నీ కట్టిపడేసింది. అది చూసినవాళ్లు పిల్లులకు సెలబ్రిటీల ఫేస్‌లు పెట్టి ఇంటర్నెట్‌లో వైరల్ చేశారు.


ఇలాంటి గిఫ్స్ ఒకప్పుడు ఫేమస్. అక్టోబర్‌లో ఓకే బూమర్స్ పేరుతో ఇలాంటివి మళ్లీ దుమ్మురేపాయి. ఫ్రెండ్లీ జనరేషనల్ రిలేషన్స్ అనేవి తగ్గిపోతున్నాయంటూ... న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనంతో ఓకే బూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది.


డిస్నీ+ సిరీస్‌ ది మాండలోరియన్‌లో బేబీ యోధా ఈ ఏడాది మరో సోషల్ మీడియా సెన్సేషన్‌గా నిలిచింది. ఈ సిరీస్ షోలను చాలా మంది చూశారు. బేబీ యోధా ఎంతో క్యూట్‌గా ఉందని కోట్ల మంది మెచ్చుకున్నారు.

First published: December 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు