Andhra Pradesh : ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటాన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ఆరు నెలల గడువు ముగిశాక... అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతూనే మరోవైపు... పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు వస్తున్న సందర్భంలో... బీసీలకు సంబంధించి ఇచ్చిన హామీల అమలుపై సీఎం జగన్ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే ఏపీలోని స్థానిక సంస్థల కోటాలో బీసీల రిజర్వేషన్లను 34 శాతం కచ్చితంగా అమలు చేస్తున్నారు. అలాగే... కాంట్రాక్ట్ పనుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం కేటాయిస్తున్నారు. ఈ రెండు హామీల అమలుతో... ఇప్పటికే జగన్ వైపు బీసీలు మొగ్గు చూపుతున్నారు. మరో వ్యూహంలో భాగంగా జగన్... త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బీసీ గర్జన సభకు జగన్... ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. కారణం... అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణయ్య... వైసీపీ తరపున ప్రచారం చేసి... ఆ పార్టీ గెలుపులో భాగమయ్యారు. ఇలాంటి చర్యలతో జగన్... బీసీలకు మరింత దగ్గర కాబోతున్నారు.
నిజానికి ఏపీలో బీసీల ఓటు బ్యాంకు... టీడీపీతో ఉండేది. కానీ... మొన్నటి చంద్రబాబు పాలనతో బీసీలు పూర్తిగా విభేదించారు. తమను వాడుకొని వదిలేస్తున్నారని భావించిన బీసీలు... చంద్రబాబుకి చెక్ పెడుతూ... వైసీపీకి మద్దతిచ్చారు. దాంతో వైసీపీకి భారీ మెజార్టీ దక్కింది. ఇప్పుడు చంద్రబాబు తిరిగి బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నా అంతగా ఫలితం కనిపించట్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Andhra updates, Breaking news, India news, National News, News online, News today, News updates, Telugu news, Telugu varthalu