Home /News /trending /

Sex Doll: సెలబ్రిటీని పోలిన సెక్స్ డాల్.. ఆమె అనుమతి లేకుండానే తయారీ.. ఆ సెలబ్రిటీ ఎవరంటే..

Sex Doll: సెలబ్రిటీని పోలిన సెక్స్ డాల్.. ఆమె అనుమతి లేకుండానే తయారీ.. ఆ సెలబ్రిటీ ఎవరంటే..

యేల్ కహేన్ అరిస్

యేల్ కహేన్ అరిస్

ఒక సెక్స్ టాయ్స్ తయారీదారు ఒక మాజీ సైనికురాలి ముఖాన్ని వాడేసింది. యేల్ కహేన్ అరిస్ (25) అనే మాజీ సైనికురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను పోలిన ఓ సెక్స్ డాల్‌ను 'డాల్ స్టూడియో' అనే కంపెనీ తయారు చేసింది. అనుమతి తీసుకోకుండానే ఆమె పెదవి కింద ఉన్న పుట్టు మచ్చతో సహా అన్ని కాపీ చేసి బొమ్మను రూపొందించింది.

ఇంకా చదవండి ...
గత కొంతకాలంగా అడల్ట్ టాయ్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతోంది. మార్కెట్లోకి అన్ని రకాల టాయ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటన్నిటిలో కెల్లా గాలితో నింపిన బ్లో-అప్ డాల్స్ బాగా అమ్ముడుపోతున్నాయి. అయితే కస్టమర్లను ఆకట్టుకోవాలంటే అన్ని ప్రొడక్ట్స్ లాగానే సెక్స్ డాల్స్ గురించి కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ డాల్స్ తయారీదారులు ముఖ్యంగా ఎదుర్కొనే మరొక సమస్య కూడా ఉంది. అదేంటంటే, నిజ జీవితంలోని ఏ మహిళ ముఖాన్ని పోలని విధంగా ఈ బొమ్మల ముఖాలను తయారు చేయాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా ఎవరైనా మహిళ ఫేస్ ని డాల్ ఫేస్ గా తయారుచేస్తే.. తయారీదారులు పెద్ద సమస్యలలో చిక్కుకుంటారు.

అయితే ఈ విషయాన్ని విస్మరించిన ఒక సెక్స్ టాయ్స్ తయారీదారు ఒక మాజీ సైనికురాలి ముఖాన్ని వాడేసింది. యేల్ కహేన్ అరిస్ (25) అనే మాజీ సైనికురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను పోలిన ఓ సెక్స్ డాల్‌ను 'డాల్ స్టూడియో' అనే కంపెనీ తయారు చేసింది. అనుమతి తీసుకోకుండానే ఆమె పెదవి కింద ఉన్న పుట్టు మచ్చతో సహా అన్ని కాపీ చేసి బొమ్మను రూపొందించింది.ఈ విషయాన్ని గుర్తించిన సదరు యువతి ఒక్క సారిగా షాక్ అయింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయం నెటిజన్లను విస్తుపోయేలా చేస్తోంది.

ఇది కూడా చదవండి: Married Woman: ఈమె ఇంటి ముందు ఒక బైక్ ఆగింది.. ఆ తర్వాత ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోరు..

యేల్ కహేన్ అరిస్ అనే యువతి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేది. ఇప్పుడు లక్షలాది మంది అభిమానులతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది. అయితే ఈ యువతి ఫొటోలను చూసిన డాల్ స్టూడియో అనే అతి పెద్ద సెక్స్ డాల్ కంపెనీ ఓ పిచ్చి ఆలోచన చేసింది. ఈ కంపెనీ ఆమె లాంటి ఒక అడల్ట్ బొమ్మ తయారు చేసింది. అది చాలదన్నట్టు పుట్టుమచ్చలతో సహా ఆమెను పోలిన బొమ్మను రూపొందించింది. అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న యాల్ కహేన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.


View this post on Instagram


A post shared by Yael Cohen Aris (@yael1c)


"నా పర్మిషన్ లేకుండా నాకు తెలియకుండానే ఒక పెద్ద కంపెనీ నాలాంటి ఒక సెక్స్ డాల్ తయారు చేసింది. ఇది జోక్ కాదు, నిజం. వారు ఆ డాల్ కి నా పేరు కూడా పెట్టారు. ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాను. ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఈ విషయం గురించి మా దేశంలోని టీవీ షోలలో కూడా వచ్చింది. దీని గురించి ఇప్పుడు మీ(ఫ్యాన్స్)తో షేర్ చేయాల్సిన సమయం వచ్చింది. ఈ సెక్స్ డాల్స్ విక్రయాన్ని ఆపవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను." అని ఆమె తన పోస్ట్ లో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Viral: ఇదేదో రికార్డింగ్ డ్యాన్స్‌లో సీన్ కాదు.. వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఉంది ఎవరో తెలిస్తే..

“డాల్ హెడ్ గురించి జరుగుతున్న చర్చపై స్పందించాల్సిందిగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాంటాక్ట్ అయ్యారు. అప్పుడే, ఆ బొమ్మ ముఖం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అది నాకు బాగా తెలిసిన ముఖంలా అనిపించింది. ఆ సమయంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. తర్వాత మర్చిపోయాను" అని యేల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చాలా బాధ, కోపంలో ఉన్న సదరు యువతి ఆ డాల్స్ విక్రయాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నానని.. లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు చెబుతోంది. ప్రస్తుతం ఆమె లాంటి సెక్స్ డాల్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదేం పాడు పని అంటూ ఆ డాల్ కంపెనీపై చాలా మంది ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Celebrity, Sex, Viral, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు