గులాబ్ జామూన్ పిజ్జా తిన్నారా... నెట్‌లో అదే చర్చ

Gulab Jamun Pizza : ఇంటర్నెట్‌లో నెటిజన్లు చాలా తెలివైన వారు. వాళ్లు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయంపై చర్చించుకుంటూ ఉంటారు. గులాబ్ జామూన్ పిజ్జా కూడా అలాంటిదే. దాని సంగతేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 10, 2019, 9:19 AM IST
గులాబ్ జామూన్ పిజ్జా తిన్నారా... నెట్‌లో అదే చర్చ
గులాబ్ జామూన్ పిజ్జా తిన్నారా... నెట్‌లో అదే చర్చ
  • Share this:
మ్యాగీ హాట్‌గా ఉంటుంది... దోసె కారంగా ఉంటుంది. అలా కాకుండా... అవి తియ్యగా ఉంటే... అది ఆశ్చర్యమే. వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. ఇలాగే... తియ్యటి గులాబ్ జామూన్ పిజ్జా గురించి కూడా నెటిజన్లు బాగానే మాట్లాడుకుంటున్నారు. ట్విట్టర్ నుంచీ రెడ్డిట్ వరకూ... అన్నింటా అదే చర్చ. చాలా మంది అరేయ్... ఈ పిజ్జా చూడు ఎలా ఉందో... అంటూ... తమ ఫ్రెండ్స్‌కి పిజ్జా ఫొటోను షేర్ చేసుకున్నారు. అది అలా ఎందుకుంది? దాన్ని తయారుచేసిందెవరు? ఎందుకు చేశారు? టేస్ట్ ఎలా ఉంది? ఇలా ప్రతి ఒక్కరూ రకరకాలుగా దాని గురించి మాట్లాడుకున్నారు. కొందరైతే చాటింగ్ డిబేట్లు పెట్టుకున్నారు. అంతలా గులాబ్ జామూన్ పిజ్జా ఫేమస్ అయ్యింది.

వైరల్ అయిన గులాబ్ జామూన్‌లో... పిజ్జా ముక్కలపై గులాబ్ జామూన్లు ఉన్నాయి. అంతేకాదు... డ్రై ఫ్రూట్స్, డ్రై రోజా పూల రేకులు కూడా ఉన్నాయి. చాలా మంది దాన్ని టేస్ట్ చూడాలని ఉందని అన్నారు. కొంతమంది దాన్ని ఎలా తయారుచెయ్యాలో తెలుసుకోవాలని ఉందన్నారు. ఓ రెడ్డిట్ యూజర్... అది ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. మరో ట్విట్టర్ యూజర్... దానిపై ఎలాంటి సాస్ వేసుకోవాలని అడిగారు. ఇలాంటి పిజ్జా తింటే... అటు పిజ్జా టేస్టూ లేక, ఇటు గులాబ్ జామూన్ టేస్టూ లేక... మొత్తానికీ నోరు పాడవుతుందని మరో నెటిజన్ స్పందించారు. ఇంతకీ అసలా పిజ్జాను పాకిస్థాన్‌లో చేసిందెవరో, ఆ ఫొటోను మొదట షేర్ చేసిందెవరో ఎవరికీ తెలియట్లేదు.

 

Pics : వరైటీ వంటలతో వరల్డ్ ఫేమస్ అయిన రాచెల్ గోయెంకాఇవి కూడా చదవండి :

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ముందు మరో 4 కేసులు...

25వేల ఉద్యోగులు... 10 కోట్ల ఫోన్లు... షామీ విజయప్రస్థానంపై స్పెషల్ రిపోర్ట్

జగన్ మరో సంచలన నిర్ణయం... పేదలకు షాకే...

అయోధ్యలో రామమందిరం ఎలా ఉంటుందో తెలుసా... ఇలా...

IND vs BAN : నేడు మూడో టీ20... గెలిస్తే సిరీస్ మనదే
First published: November 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading