ఒకే వ్యక్తితో ఒకే సమయంలో పిల్లల్ని కంటామంటున్న కవల అక్కాచెల్లెలు

ప్రపంచ కవలల్లో ఆ అక్కాచెల్లలూ... అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారనే పేరుంది. ఇప్పుడు వాళ్ల కొత్త కోరిక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

news18-telugu
Updated: July 28, 2020, 11:56 AM IST
ఒకే వ్యక్తితో ఒకే సమయంలో పిల్లల్ని కంటామంటున్న కవల అక్కాచెల్లెలు
ఒకే వ్యక్తితో ఒకే సమయంలో పిల్లల్ని కంటామంటున్న కవల అక్కాచెల్లెలు (credit - Youtube)
  • Share this:
ప్రపంచంలో అత్యంత ఎక్కువగా పోలికలు ఉన్న కవలలుగా గుర్తింపు పొందిన అన్నా, ల్యూసీ... 2018లో తమ బాయ్‌ఫ్రెండ్‌ని ప్రపంచానికి చూపించారు. అతన్నే పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అందుకు చట్టం ఒప్పుకోలేదు. ఆస్ట్రేలియాకి చెందిన ఈ కవలలు... 2012 నుంచి బెన్ బైర్న్‌తో డేటింగ్ చేస్తున్నారు. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి ఇద్దర్ని చేసుకోవడానికి చట్టాలు ఒప్పుకోవు. దాంతో వాళ్ల ప్లాన్ బెడిసికొట్టింది. ఆ తర్వాత ఈ అక్కాచెల్లెలూ సైలెంటయ్యారు. టీవీ, ఇంటర్నెట్‌కి దూరమయ్యారు. తాజాగా మరోసారి టీవీ షోలో వెబ్ చాట్ ద్వారా కనిపించి... తమ ప్రెగ్నెన్సీ ప్లాన్స్‌ను వివరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఒకే వ్యక్తితో, ఒకే సమయంలో ప్రెగ్నెంట్ అవ్వాలన్నది వాళ్ల కోరిక. ఇది వేల మంది సోషల్ మీడియా నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ఇద్దరూ... ఒకే వ్యక్తితో ప్రెగ్నెన్సీ కావాలనుకోవడమే ఒక ఆశ్చర్యం అనుకుంటే... ఒకే సమయంలో కావాలనడం కూడా మరో చిక్కు ప్రశ్నగా మారింది. వెంటనే ఇంటర్వూ చేస్తున్న యాంకర్ ఇదెలా కుదురుతుంది... కొంచెం వివరంగా చెబుతారా అని అడిగారు. "దీనికి మా దగ్గర స్పెషల్ ప్లాన్ ఉంది. ఇద్దరం IVF ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటాం. బెన్ ద్వారా ఇద్దరం ఒకే సమయంలో గర్భం దాల్చుతాం. తద్వారా ఇద్దరం ఒకే సమయంలో పిల్లల్ని కంటాం" అని చెప్పారు.

అసలు ఇలా ఎందుకు నిర్ణయించుకున్నారు అంటే... ఈ కవలలు ఓ కారణం చెప్పారు. "మేం కలిసి మేకప్ వేసుకుంటాం. ఒకే సమయంలో పడుకుంటాం. కలిసి తింటాం. ఇద్దరికీ ఒకేసారి ఆకలి వేస్తుంది. అన్నీ ఒకేసారి అనిపిస్తాయి. మేం అలాగే జీవిస్తున్నాం. అందుకే ఒక వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం" అని చెప్పారు.

ఇది ఎలా సాధ్యమవుతుందని హోస్ రూత్ లాంగ్స్‌ఫోర్డ్ ప్రశ్నించారు. ఎగ్జాక్ట్‌లీ ఒకే సమయంలో ఇద్దరూ పిల్లల్ని ఎలా కంటారని అడిగారు. "ఇద్దరం ఒకేసారి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటాం కాబ్టటి... అన్నీ కలిసే చేస్తాం కాబట్టి... అదీ అలాగే జరుగుతుంది" అని చెప్పారు. కలిసే చస్తాం అని కూడా అన్నారు.

ఇక్కడ మనం ఓ విషయం చెప్పుకోవాలి. అన్నా, ల్యూసీ ఇద్దరూ పుట్టుకతోనే అచ్చుకుద్దినట్లు లేరు. వీళ్లు అలా కనిపించడం కోసం... ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఇందుకు రూ.1,86,89,380కు పైగా ఖర్చుపెట్టారు. తమకు 20 ఏళ్ల వయసు నుంచే లిప్ ఫిల్టర్స్, బ్రెస్ట్ ఇంప్లా్ంట్స్, ఫేషియల్ టాటూయింగ్, స్కిన్ నీడ్లింగ్ వంటివి చేయించుకున్నారు. 14వ సర్జరీ తర్వాత ఇక వాటికి ఫుల్‌స్టాప్ పెట్టారు.
Published by: Krishna Kumar N
First published: July 28, 2020, 11:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading