World Top cities: ప్రపంచంలో బెస్ట్ సిటీ ఏది ? మన దేశంలో ఏది టాప్ ? తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

World Best Cities: ప్రస్తుతానికి కోవిడ్ వల్ల వర్చువల్ టూర్లను మాత్రమే మనం ఆస్వాదించడం సురక్షితం. కానీ ప్రపంచంలోని అత్యుత్తమ పట్టణాలు ఏవి అన్న సర్వేలో మాత్రం పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

news18-telugu
Updated: November 18, 2020, 6:54 PM IST
World Top cities: ప్రపంచంలో బెస్ట్ సిటీ ఏది ? మన దేశంలో ఏది టాప్ ? తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచం సాధారణ స్థితికి చేరుకునేందుకు ఎంతో సమయం పట్టదు. కరోనా మహమ్మారి (corona pandemic) పీడ విరగడయ్యేందుకు రోజులు సమీపిస్తుండగా, టీకా సమర్థవంతంగా పనిచేస్తే ఇక మనమంతా సాధారణ జీవితాన్ని గతంలోలానే గడపచ్చు. సాధారణ జీవితమంటే అందరికీ గుర్తుకొచ్చేది సరదాగా టూర్లు కొట్టే రోజులే. ప్రస్తుతానికి కోవిడ్ వల్ల వర్చువల్ టూర్లను (virtual tours) మాత్రమే మనం ఆస్వాదించడం సురక్షితం. కానీ ప్రపంచంలోని అత్యుత్తమ పట్టణాలు (best city) ఏవి అన్న సర్వేలో మాత్రం పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రియల్ ఎస్టేట్, టూరిజం, ఎకనమిక్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన పలు అంశాలపై సలహాలు, సూచనలను ఇచ్చే సంస్థ రెసోనాన్స్ కన్సల్టెన్సీ (Resonance Consultancy ) తాజా రిపోర్ట్ ప్రకారం 10,00,000 జనాభా (million population) దాటిన ప్రపంచ నగరాలపై ఈ ఆసక్తికర అధ్యయనం సాగింది. 25 అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించడం హైలైట్. భిన్నత్వం, వాతావరణం, అందుబాటులో ఉన్న పార్కుల సంఖ్య, టూరిస్ట్ అట్రాక్షన్స్(tourist attractions), సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్స్(social hash tags) , చెక్ ఇన్స్ వంటి పలు అంశాలు ఇందులో ఉన్నాయి. ఇక ఏడాది కొత్త అంశాలను కూడా ఈ నివేదిక రూపొందించడంలో పొందుపరచారు. నిరుద్యోగం, కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల రేటు (జూలై లెక్కల ప్రకారం), ఆర్థిక వ్యత్యాసాలు అనే అంశం ఆధారంగా కూడా సర్వే సాగడం విశేషమే కదా. 2021 లో రాకింగ్ సిటీలు (rocking cities)గా ఉండబోయే టాప్ 10 సిటీలు ఏవో మీరే చూడండి.

టాప్ 10 ప్రపంచ మహా నగరాలు
లండన్ (బ్రిటన్)
న్యూయార్క్ (అమెరికా)
ప్యారిస్ (ఫ్రాన్స్)
మాస్కో (రష్యా)

టోక్యో (జపాన్)
దుబై (UAE)
సింగపూర్
బార్సిలోనా (స్పెయిన్)
లాస్ ఏంజిలెస్ (అమెరికా)
మ్యాడ్రిడ్ (స్పెయిన్)

పైన చెప్పిన గ్లోబల్ సిటీలతో పాటు రోమ్ (ఇటలీ) చికాగో (అమెరికా), టొరంటో (కెనడా), శ్యాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) అబు దబి ( UAE), సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా), ఆమ్ స్టర్ డ్యాం (నెదర్లాండ్స్), బెర్లిన్ (జర్మనీ), ప్రేగ్ (జెక్ రిపబ్లిక్), వాషింగ్టన్ డీసీ (అమెరికా) వంటి మహా నగరాలతో పాటు మనదేశంలోని న్యూఢిల్లీకి 62 వ ర్యాంక్ దక్కడం విశేషం. ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక ఇండియన్ సిటీ ఢిల్లీనే.

మీరెన్ని చూశారు?
మొత్తానికి కొత్త సంవత్సరంలో ఆకట్టుకునే సరికొత్త టాప్ 10 నగరాల జాబితాను చదివారు కదా మరి వీటిలో మీరు ఎన్ని గ్లోబల్ సిటీలను చుట్టొచ్చారు. మీకు ప్రపంచ పర్యటన చేయాలనుంటే ఈ జాబితాలోని సిటీలను ఎంచుకుంటే బాగుంటుందని ట్రావెల్ బ్లాగర్స్ (travel bloggers) సూచిస్తున్నారు. గ్లోబల్ అట్రాక్షన్స్ (global attractions) గా పేరుగాంచిన ఈ సిటీల్లో చూసేందుకు చాలా అట్రాక్షన్స్, సదుపాయాలు ఉన్నాయి. అంతేకాదు మీ రొటీన్ జీవితానికి కొన్ని రోజులు సెలవు పెట్టి మీలోని పర్యాటకుడికి రెక్కలు తొడిగి, అలా ప్రపంచ పర్యటన చేసే ఆలోచన ఉంటే పక్కాగా ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.

కరోనాకు టీకా వచ్చాక హ్యాపీగా అలా విహరించి, సరదాగా గడపండి. ఒక్క విదేశాలు మాత్రమే అనుకోకండి, మన రాజధాని ఢిల్లీనే తీసుకోండి ఒక్కసారి ఢిల్లీలో ల్యాండ్ అయ్యారో ఈ మహా నగరాన్ని చుట్టేయాలంటే వారం రోజులైనా తక్కువే. తినేందుకు, కొనేందుకు, చూసేందుకు ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇక ఢిల్లీని ఆనుకుని చూసేందుకు బోలెడు పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: November 18, 2020, 6:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading